ఎన్టీఆర్ గెటప్‌లో బాలయ్య డూప్‌లాగా ఉన్నాడు.. ముందుగానే ఆర్జీవీ చెప్పాడు.. లక్ష్మీ పార్వతి!

ఎన్టీఆర్ బయోపిక్ ని బాలయ్య రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కథానాయకుడులో సినిమా రంగ విశేషాలు, ఎన్టీఆర్ మహా నాయకుడులో రాజకీయ విశేషాలు చూపించబోతున్నారు. ఈ చిత్రానికి పోటీగా వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రారంభించారు. ఇటీవల తిరుపతి వేదికగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విషయంలో వివాదం కొనసాగుతూనే ఉంది. తాను వాస్తవాలు చూపిస్తా అంటూ ఆర్జీవీ ఈ చిత్రాన్ని ప్రారంభించారు. తాజాగా ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆర్జీవీ చిత్రమే విజయం సాధిస్తుంది

ఆర్జీవీ చిత్రమే విజయం సాధిస్తుంది

ఆర్జీవీ తెరకెక్కిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్, బాలయ్య నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ వివాదం గురించి లక్ష్మి పార్వతి స్పందించింది. ఎన్టీఆర్ నిజమైన కథ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. డాన్సులు చూడడానికి ఎవరూ సినిమాకు వెళ్లరు. ఎన్టీఆర్ జీవితం గురించి ఎవరు నిజాలు చూపిస్తే ఆ చిత్రమే విజయం సాధిస్తుంది. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన నిజమైన తెలుసుకోవాలంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం చూడాలని ఆర్జీవీ ముందుగానే చెప్పాడు. కాబట్టి ఆయన చిత్రమే విజయం సాధిస్తుంది అని లక్ష్మీ పార్వతి తెలిపారు.

అది బయోపిక్ ఎలా అవుతుంది

అది బయోపిక్ ఎలా అవుతుంది

ఎన్టీఆర్ ఆ సినిమాలో నటించారు.. ఈ సినిమాలో నటించారు అని చూపిస్తే అది బయోపిక్ ఎలా అవుతుంది అంటూ బాలయ్య చిత్రంపై సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ నటించిన చిత్రాలు ఎలాగు ప్రజల ముందు ఉన్నాయి కదా. ఆయన జీవితంలో జరిగిన సంఘటనలని నిజంగా చూపించగలిగితే అది బయోపిక్ అవుతుంది అని లక్ష్మి పార్వతి అభిప్రాయ పడ్డారు.

బాలయ్య డూప్‌లాగా ఉన్నాడు

బాలయ్య డూప్‌లాగా ఉన్నాడు

ఎన్టీఆర్ పర్సనాలిటీని ఎవరూ బీట్ చేయలేరు. బాలయ్య ఆయనలా గెటప్ వేసుకుంటే నాకు డూప్ లాగా అనిపించింది అంటూ కామెంట్ చేశారు. ఎన్టీఆర్ కి జరిగిన అన్యాయం గురించి సినిమా తీసే ధైర్యం ఆర్జీవికి తప్ప మరొకరికి లేదు. నా పేరు పెట్టినంత మాత్రాన సినిమా ఆడుతుందని చెప్పడం లేదు. ఆర్జీవీ అనుకున్నది తీస్తారనే నమ్మకం ఉందని లక్ష్మి పార్వతి అన్నారు.

పోసాని కృష్ణ మురళి ఒక్కడే

పోసాని కృష్ణ మురళి ఒక్కడే

ఎన్టీఆర్ కి జరిగిన అన్యాయం గురించి మాట్లాడే ధైర్యం ఇండస్ట్రీలో ఎవరికీ లేదు. కానీ పోసాని కృష్ణ మురళి మాత్రం ఎన్టీఆర్ కి జరిగిన అన్యాయం గురించి ధైర్యంగా మాట్లాడతారని అన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి తాను డబ్బు పెడుతున్నట్లు వస్తున్న వార్తలని ఆమె ఖండించారు. నావద్ద అంత డబ్బు ఉంటె ఎప్పుడో ఆ పని చేసేదానిని. నా వద్ద డబ్బు లేదనే విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి తెలుసు అని లక్ష్మీ పార్వతి అన్నారు.

బసవతారకం పాత్ర

బసవతారకం పాత్ర

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బసవతారకం పాత్రని బాగా హైలైట్ చేసి తన పాత్రని తగ్గిస్తున్నారనే కామెంట్స్ పై ఆమె స్పందించారు. అది మంచి పనే. నేను స్వాగతిస్తా. బసవతారకంని అక్క ని సంభోదిస్తూ.. అక్క నాకు ఎప్పటికి పూజ్యురాలు. నా పూజ గదిలో ఎన్టీఆర్ ఫొటోతో పటు అక్క ఫొటో కూడా ఉంటుంది. ఆమె స్థానాన్ని నాకు ఇచ్చి వెళ్లారు అని లక్ష్మి పార్వతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X