Taraka Ratna: ఎప్పుడో చనిపోయినా నిజాన్ని దాచారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
నందమూరి తారకరత్న మరణించడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. నందమూరి కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా నందమూరి అభిమానులు కూడా ఈ విషాదంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే ఈ క్రమంలో నందమూరి తారకరత్న మృతి పై లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇదివరకే ఆమె ఈ విషయంలో చేసిన కొన్ని కాంట్రవర్సీ విషయాలు కొంతమంది నందమూరి అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. అయితే ఇప్పుడు మరోసారి ఆమె తారకరత్న మృతి గురించి స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే..

పాదయాత్ర మొదలైనప్పుడు
నందమూరి తారకరత్న గత నెలలో నారా లోకేష్ మొదలుపెట్టిన పాదయాత్రలో పాల్గొంటూ ఒక్కసారిగా గుండె నొప్పితో కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. కార్డియక్ అరెస్ట్ కావడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. ఇక వెంటనే సమీప ఆసుపత్రిలోకి ఆయనను తీసుకువెళ్లారు. అయినప్పటికీ కూడా అక్కడ కోలుకోలేదు.

మళ్ళీ తిరిగి వస్తాడు అని..
ఇక చికిత్స అందించేందుకు తారకరత్న బెంగళూరులోని హృదయాలయ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అక్కడ విదేశాల నుంచి కూడా కొంతమంది వైద్యులు రావడం జరిగింది. ఇక తారకరత్న పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలియజేసినట్లుగా కథనాలు అయితే విలువడ్డాయి. బాలకృష్ణ కూడా అనేక పూజలు యాగాలు హోమాలు చేయించారు. తప్పకుండా తారకరత్న మళ్ళీ తిరిగి వస్తాడు అని అందరూ కోరుకున్నారు.

లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు
అయితే ఈ క్రమంలో సీనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఊహించిన విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇదివరకే ఆమె తారకరత్న ఆరోగ్యం విషయంలో నారా లోకేష్ గురించి ఊహించని విధంగా నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఆయన పాదయాత్ర మొదలుపెట్టగానే ఇలా అపశకునం చోటుచేసుకుంది అని ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో కూడా వేడి పుట్టించాయి.

చెడ్డపేరు వస్తుందని..
ఇప్పుడు తారకరత్న మృతి చెందడంతో ఆమె మరోసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. లక్ష్మీపార్వతి మాట్లాడుతూ తారకరత్న మరణించడం చాలా బాధాకరమైన విషయం. అయితే చంద్రబాబు తమ కుటుంబ సభ్యులపై నీచమైన రాజకీయ విధానాన్ని కొనసాగించినట్లుగా ఆమె విమర్శలు చేశారు. నారా లోకేష్ పాదయాత్రకు చెడ్డ పేరు వస్తుందని తారనకరత్న మరణ వార్తను దాచినట్లు ఆమె తెలియజేశారు.

మానసిక క్షోభకు గురిచేశారు
రెండు రోజుల పాదయాత్ర వాయిదా వేసినప్పుడే మరణ వార్త గురించి ప్రకటించి ఉండాలి. కానీ అందరూ అపశకునంగా భావిస్తారు అని ఇన్నాళ్లుగా ఆయన డ్రామా వేసినట్లు చాలా క్లారిటీగా అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఇద్దరు కూడా ఈ రాష్ట్రానికి అపశకునం అని ప్రజలకు కూడా తెలుసు. అందుకే ప్రాణాలు కోల్పోయిన తారకరత్నను వారి స్వార్ధపూరితమైన రాజకీయాల కోసం ఇన్నాళ్లు ఆసుపత్రుల్లోనే ఉంచారు.. అలాగే తారకరత్న తల్లిదండ్రులను, భార్య బిడ్డలను మానసిక క్షోభకు గురి చేశారు అని లక్ష్మీపార్వతి కామెంట్ చేశారు.


Click it and Unblock the Notifications











