తండ్రి మోహన్ బాబు కోపంపై మంచు లక్ష్మి ప్రసన్న వివరణ
మంచు ఎంటర్టైన్మెంట్స్ అంటూ వేరే బ్యానర్ పెట్టారని తన తండ్రి మోహన్ బాబు కోప్పడుతున్నారనే వార్తలను మంచు లక్ష్మి ప్రసన్న ఖండించింది. ఆయనకు తను సొంతంగా బ్యానర్ పెట్టుకోవటంపై కోపం ఏమీ లేదని, అంతేగాక తనకు బ్యానర్ విషయమై అనేక సూచనలు,సలహాలు ఇచ్చారని చెప్పుకొచ్చింది.తాను,తన భర్త సంతోషంగా ఉండటం ఆయన ఆశిస్తున్నారని చెప్పింది.
అలాగే ఇప్పటికీ తాను తన తండ్రికి ఇష్టమైన బట్టలను వేసుకుంటాని,ఆయన టేస్ట్ ప్రకారమే నడుచుకుంటా నని చెప్పుకొచ్చింది.ఇక ప్రస్తుతం లక్ష్మి ప్రసన్న తను కొత్తగా పెట్టిన బ్యానర్ పై తన సోదరుడు మంచు మనోజ్ హీరోగా ఊ కొడతారా...ఉలిక్కి పడతారా అనే చిత్రం నిర్మిస్తోంది.అలాగే తను ప్రధాన పాత్రలో గుండెల్లో గోదావరి అనే చిత్రం కూడా ప్లాన్ చేస్తోంది.అందుకోసం ఆమె ఇళయరాజాతో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిపింది.


Click it and Unblock the Notifications











