మంచు లక్ష్మికి రొమాన్స్ చేసేవాడు దొరికాడోచ్!

By Bojja Kumar

మంచు లక్ష్మి ప్రసన్న. మోమహన్ బాబు కూతురుగా సినిమా రంగంలోకి అడుగు పెట్టిన లక్ష్మి అనగనగా ఓ ధీరుడు చిత్రంలో నెగెటివ్ రోల్ తో తెలుగు తెరపై దూకింది. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ దొంగల ముఠాలోనూ నటించింది. ప్రస్తుతం లక్ష్మి బాలీవుడ్ సినిమా 'డిపార్టుమెంట్' చిత్రంలో సంజయ్ దత్ భార్యగా నటిస్తోంది. త్వరలో లక్ష్మి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆ సినిమా పేరు 'గుండెల్లో గోదారి'.

ఈ సినిమాకు స్వయంగా లక్ష్మినే నిర్మాత కావడం గమనార్హం. కుమార్ అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం తన సరసన నటించే హీరో కోసం స్వయంగా వేట ప్రారంభించింది లక్ష్మి. ద్విభాష చిత్రంగా రూపొందబోతున్న ఈ సినిమా కోసం ఆది పనిశెట్టిని హీరోగా ఎంపిక చేసుకుంది. ఆది తమిళంలో మంచి పేరున్న నటుడు. ఒక విచిత్రం, వైశాలి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మరి హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి మంచు లక్ష్మి చేస్తున్న ఈ ప్రయత్నం ఎంత మేరకు ఫలిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X