కమల్ హాసన్ కి నో చెప్పిన మంచు లక్ష్మీ ప్రసన్న
కమల్ హాసన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'విశ్వరూపం" ఈ చిత్రానికి హీరోయిన్ సమస్య ఏర్పడింది. ఈ చిత్రంలో దీపికా పదుకునే, సోనాక్షి సిన్హా, అనుష్క వంటి టాప్ హీరోయిన్ లను సంప్రదించినప్పటికీ కూడా డేట్స్ కారణంగా ఒప్పుకోలేదు. కమల్ హస్సన్ చిత్రం లో నటించటం అంటే ఒక గొప్ప అదృష్టం గా చాలా మంది నటీ నటులు భావిస్తారు. అటువంటిది మరి కమల్ హస్సన్ స్వయం గా ఫోన్ చేసి అవకాసం ఇస్తే ఎవరైనా కాదంటారా? మన తెలుగు ఆడపడుచు లక్ష్మి ప్రసన్న సరిగ్గా అదే చేసిందండి. కమల్ హస్సన్ కి నో చెప్పింది.
తన విశ్వరూపం చిత్రం లో ఒక పాత్ర వేయమని లక్ష్మి ని కమల్ కోరాడు అంట. అయితే ప్రస్తుతం డిపార్టుమెంటు చిత్రం లో బిజీ గా ఉన్న లక్ష్మికి డేట్లు ఖాళీ లేక ఒప్పుకోలేక పోయిందట. ఈ విషయం తానే స్వయం గా చెప్పుకుని తెగ బాధ పడిపోతోంది ఈ మంచు వారి సొగసరి భామ. కాగా తాజాగా సమీరా రెడ్డిని హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం కమల్ తన 'విశ్వరూపం" కోసం హీరోయిన్ ను వెతికే ప్రయత్నంలో ఉన్నాడంట. మరి కమల్ సరసన జతకట్టే ఆ హీరోయిన్ ఎక్కడుందో ఏమో త్వరలోనే తెలియనుంది..


Click it and Unblock the Notifications











