కసబ్ కు ఉరిశిక్ష కరెక్టు కాదు: మంచు లక్ష్మి

By Bojja Kumar

హైదరాబాద్ : ముంబైలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ ఉరి శిక్షపై మంచు లక్ష్మి ట్విట్టర్ లో స్పందించింది. ఆమె తన తాజా ట్వీట్ లో ..."మరణ శిక్షను నేను ఒప్పుకోను...అది చాలా సులక్షమైనది,కసబ్ ని ఉరితీయకుండా అతనికి జీవితం విలువ తెలియచెప్పాల్సింది" అంది. మహమ్మద్ అజ్మల్ అమీర్ కసబ్‌కు విధించిన ఉరి శిక్ష వంద శాతం సమంజసమేనని దేశంలోని అన్ని రాజకీయపక్షాలు,ప్రజలు ముక్త కంఠంతో హర్షిస్తున్న ఈ సమయంలో మంచు లక్ష్మి ట్వీట్ అందరిలో ఆశ్చర్యం కలిగిస్తోంది.

మరో ప్రక్క కసబ్ ఉరితో న్యాయం గెలిచిందని బాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశానికి శుభాకాంక్షలు తెలుపుతూ మధుభండార్కర్, అనుపమ్‌ఖేర్, ఓంపురి, అభిషేక్‌బచ్చన్, రామ్‌గోపాల్‌వర్మ, రవీనాటాండన్, రితేష్ దేశ్‌ముఖ్, శ్రేయాస్ తల్పడే తదితరులు ట్వీట్ చేశారు.

ప్రస్తుతం మంచు లక్ష్మి తాను నటిస్తూ 'గుండెల్లో గోదారి' నిర్మించింది. మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం ఆడియో విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈచిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఆది పనిశెట్టి, తాప్సీ, మంచు లక్ష్మి, సుదీప్ కిషన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది. 1986లో వచ్చిన వదరలు, ప్రేమకథను మిళితం చేసిన కథతో ఈ సినిమా రూపొందుతోంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు. ముమైత్ ఖాన్ ఐటం సాంగు చేస్తోంది. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కానుంది. చిత్రంలో ప్రతి ఒక్కరు కొత్తగా కనిపించనున్నారు.

కథా వస్తువు మత్స్యకారుల జీవితాలకి సంబంధించినది కావడం వల్ల, పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలోని 27 ఎకరాలలో 120 గుడిసెలతో కూడిన పల్లె సెట్ ను వేశారు. చిత్రం చాలా వరకు పాలకొల్లు,అమలాపురం మరియు గోదారి జిల్లాల పరిసరాలలో తెరకెక్కించారు. ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రానికి సమర్పణ:మోహన్‌బాబు.ఎం. నిర్మాత:మంచు లక్ష్మీ ప్రసన్న, దర్శకత్వం:కుమార్ నాగేంద్ర.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X