‘లక్ష్మీ రావె మాఇంటికి’ ఆడియో డేట్ ఖరారు
హైదరాబాద్: కుటుంబ నేపథ్యంలో సాగే ప్రేమకథతో ‘లక్ష్మీ రావే మా ఇంటికి' చిత్రాన్ని మలుస్తున్నారు. నాగ శౌర్య, అవికాగోరె హీరో హీరోయిన్లు. గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై మామిడిపల్లి గిరిధర్ నిర్మిస్తున్నారు. రచయితగా సుపరిచితమైన నంద్యాల రవి దర్శకత్వం వహిస్తున్నారు.
షూటింగ్ పార్టు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనుల్లో ఉంది. కాగా ఈచిత్రం ఆడియోను ఈ నెల 16న హైదరాబాద్ లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత గిరిధర్ మామిడిపల్లి తెలియజేస్తూ పాత్రలకు తగ్గట్టుగా నటీనటులను ఎన్నుకోవడంతో చిత్రం అనుకున్న విధంగా చాలా బాగా వచ్చిందని తెలిపారు.

కె.ఎం.రాధాకృష్ణ సంగీత సారథ్యంలో రూపొందిన పాటలు వీనుల విందుగా ఉంటాయని, విడుదల చేయబోయే ఆడియో పెద్ద హిట్టవుతుందనే నమ్మకం వ్యక్తం చేసారు. దర్శకడు నంద్యాల రవి మాట్లాడుతూ, లవ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా దీనిని తెరకెక్కించామని అన్నారు.
ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో షాయాజీ షిండే, అలీ, ప్రగతి, సత్యం రాజేష్, రావు రమేష్, అనితా చౌదరి, ప్రగతి, భగవాన్, శశి తదితరులు తారాగణం. ఈ చిత్రానికి చాయాగ్రహణం: బాలరెడ్డి, సంగీతం: కె.ఎం.రాధాకృష్ణన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కుంపట్ల రాంబాబు, సమర్పణ: తాడిశెట్టి వెంకట్రావు, నిర్మాత: మామిడిపల్లి గిరిధర్, కథ, మాటలు, స్క్రీప్ ప్లే, దర్శకత్వం: నంద్యాల రవి.


Click it and Unblock the Notifications











