సిటీలో ఇలియానా, ఆడియో వేడుకలో సందడి (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన సన్న నడుపు సెక్సీ బ్యూటీ ఇలియానా....బాలీవుడ్ వెళ్లిన తర్వాత తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో సందడి చేసారు. ‘లక్ష్మీ రావె మా ఇంటికి' ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై ప్రముఖ జర్నలిస్ట్ గిరిధర్ నిర్మాతగా నంద్యాల రవి దర్శకత్వంలో శౌర్య, అవికా గోర్ జంటగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీ రావే మా ఇంటికి'. కె.ఎం.రాధాకృష్ణన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో వేడుక ఆదివారం జె.ఆర్.సి కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది.

ఈ వేడుకకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఇలియానా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు. ఈ చిత్ర హీరోయిన్ అవికా గోర్ తల్లి చేతన్ గోర్ ఆడియో సీడీలను ఆవిష్కరించారు. తొలి సీడీని నాగశౌర్య తల్లి ఉష అందుకున్నారు. స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

''నా కెరియర్ గిరిధర్ గారి వల్లే టాలీవుడ్ లో మంచి మలుపు తీసుకుంది. ఇక్కడి నుంచి బాలీవుడ్ కి వెళ్లాను. ఇదంతా గిరిధర్ గారి సహరకారంతోనే జరిగింది. ఈ రోజు ఆయన ఈ చిత్రానికి నిర్మాత అవ్వడం, ఆ ఆడియో వేడుకకు నేను రావడం ఆనందంగా ఉంది. టాలీవుడ్ ని నేను చాలా మిస్ అవుతున్నాను. త్వరలోనే తెలుగు సినిమా చేస్తాను. నాగ శౌర్య, అవికా గోర్ జంట బాగుంది '' అని ఇలియానా అన్నారు. ఇంకా ఈ వేడుకకు హీరోయిన్లు రాశి ఖన్కా, క్రితి కర్బంద తదితరులు హాజరయ్యారు.

లక్ష్మీ రావె మా ఇంటికి

లక్ష్మీ రావె మా ఇంటికి

నంద్యాల రవి, గిరిధర్ గారి లాంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తులతో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అవికా గోర్ చక్కటి కో-స్టార్. నా కెరియర్ కి ఈ సినిమా బాగా హెల్ప్ అవుతుందనే నమ్మకం ఉంది'' అన్నారు.

తెలుగు ప్రేక్షకులు ఆదరించారు

తెలుగు ప్రేక్షకులు ఆదరించారు

తొలి చిత్రం ‘ఉయ్యాల జంపాలా'తోనే తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతో ఆదిరించారు. ఈ సినిమా కథ కూడా చాలా బాగుంటుంది. డైరెక్టర్ కథ, నా పాత్ర చెప్పగానే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమాకు కూడా వారి ఆదరాభిమానాలు ఉంటాయని భావిస్తున్నాను' అన్నారు.

లవ్ స్టోరీ

లవ్ స్టోరీ

డైరెక్టర్ నంద్యాల రవి మాట్లాడుతూ...రచయితగా పలు సినిమాలకు చేసిన నాకు దర్శకుడిగా తొలి చిత్రం. మంచి లవ్ స్టోరీ ఇది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఆడియోను, సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను'' అని తెలిపారు.

నిర్మాత తొలి ప్రయత్నం

నిర్మాత తొలి ప్రయత్నం

''25యేళ్ల నా కెరీర్ లో జర్నలిస్ట్ గా, పి.ఆర్.ఓ గా నటీనటులకు మేనేజర్ గా చేసాను. తర్వాత సొంత ప్రొడక్షన్ హౌస్ ఆరంభించాను. నంద్యాల రవి చెప్పిన కథ చెప్పినట్టు తెరపై ఆవిష్కరించారు. డిసెంబర్ నెల 5న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. రాధాకృష్ణన్ చక్కటి ట్యూన్స్ ఇచ్చారు. పాటలన్నీ బాగున్నాయి' అన్నారు.

నటీనటులు, టెక్నీషియన్స్

నటీనటులు, టెక్నీషియన్స్

ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో షాయాజీ షిండే, అలీ, ప్రగతి, సత్యం రాజేష్, రావు రమేష్, అనితా చౌదరి, ప్రగతి, భగవాన్, శశి తదితరులు తారాగణం. ఈ చిత్రానికి చాయాగ్రహణం: బాలరెడ్డి, సంగీతం: కె.ఎం.రాధాకృష్ణన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కుంపట్ల రాంబాబు, సమర్పణ: తాడిశెట్టి వెంకట్రావు, నిర్మాత: మామిడిపల్లి గిరిధర్, కథ, మాటలు, స్క్రీప్ ప్లే, దర్శకత్వం: నంద్యాల రవి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X