బాలయ్యపై బారెడు ఆశలు, ఆమె భవిష్యతేంటో?
'కాంచనమాల కేబుల్ టీవీ' చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ లక్ష్మీ రాయ్.... ఇన్నేళ్లయినా సరైనా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. ఆ మధ్య ఆమె నటించిన కాంచన, తదితర చిత్రాలు హిట్ కావడంతో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటోంది. అందాలు ఆరబోయడంలో ఏమాత్రం సిగ్గుపడని లక్ష్మి ఇప్పడు ఆశలన్నీ నందమూరి నటసింహం బాలయ్యపైనే పెట్టుకుంది.
ఆమె బాలయ్యకు జంటగా నటించిన 'అధినాయకుడు' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. బాలయ్య లాంటి పెద్ద హీరోతో చేస్తే స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోతుందనే ఆశతో ఏమాత్రం వెనకాడకుండా హాట్ హాట్ గా నటించింది. ఇటీవల ఆమె మీడియాతో మాట్లాడుతూ... అధినాయకుడు చిత్రం తర్వాత తన స్టార్ డమ్ పెరుగుతుందని, పెద్ద హీరోల సరసన అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది.
మరి లక్ష్మీ రాయ్ ఆశలు ఎంత మేరకు ఫలిస్తాయో? ఆమె భవిష్యత్ ఏమిటో..? 'అధినాయకుడు' చిత్రం విడుదలైతేగానీ చెప్పలేం. పరుచూరి మురళి దర్శకత్వంలో రూపొందిన 'అధినాయకుడు' త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఎంఎల్ కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా ఇప్పటికే విడుదలవ్వాల్సి ఉండగా ఫైనాన్షియల్ కారణాలతో ఆలస్యం అవుతోంది.
బాలయ్య ఈచిత్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా డిఫరెంట్ గా, మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. బాలయ్య కెరీర్లోనే ఈచిత్రం ఓ ప్రత్యేకమైన చిత్రంగా మిగులుందని అంటున్నారు. అభిమానుల్లో కూడా సినిమాపై భారీ అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











