లారెన్స్‌తో అఫైర్ లేదన్న లక్ష్మీరాయ్
రాఘవ లారెన్స్‌కు తనకు మధ్య కొనసాగుతున్నది సక్రమమైన స్నేహ బంధమే తప్ప...ఎలాంటి అక్రమ సంబంధం లేదని నటి లక్ష్మిరాయ్ మరోసారి స్పష్టం చేసింది. తామ ఇద్దరం వరుస ప్రాజెక్టుల్లో కలిసి పని చేస్తున్నంత మాత్రాన రంకు అంట కట్టడం సరికాదని చెప్పు కొస్తోంది. ఏ..మేమిద్దం కలిసి పని చేస్తే మీడియాకు వచ్చిన అభ్యంతరం ఏమిటి? మా పని మేం చూసుకుంటుంటే ఈ ప్రెస్సోళ్ల గోలేంటి? మమ్మల్ని మనశ్శాంతిగా బ్రతకనివ్వారా? మీడియాలో మా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి తప్పగా ప్రచారం జరుగుతుంటే నలుగులోకి వెళ్లాలంటేనే ఇబ్బంది ఉంటోంది. దయచేసి అలాంటి ప్రచారం ఆపండి అంటూ...వేడుకుంటోందట.
రాఘవ లారెన్స్ తను తీస్తున్న ప్రతి సినిమాలోనూ లక్ష్మిరాయ్ కి వీలైతే హీరోయిన్ పాత్ర , వీలుకాక పోతే కనీసం గెస్ట్ రోల్ అయినా తప్పకుండా ఇస్తున్నాడు. ఇటీవల విడుదలైన కాంచనలో లారెన్స్ సరసన హీరోయిన్ గా చేసిన లక్ష్మి, అంతకు ముందు వచ్చిన సూపర్ కౌబాయ్ లోనూ ముఖ్య పాత్రను దక్కించుకుంది. తమిళంలో లారెన్స్ రూపొందిన పెన్ సింగంలో గెస్ట్ రోల్ చేసింది.
దీంతో...లారెన్స్ కు లక్ష్మికి మధ్య ఏదో బంధం ఉందనే వార్తలు ఊపందుకున్నాయి. ఏ 'సం"బంధం లేక పోతే ఎంతో మంది హీరోయిన్లు ఉండగా, తన హైటుకు, కలర్ కు అస్సలు సూటవ్వని లక్ష్మికి మళ్లీ మళ్లీ ఎందుకు ఛాన్సు ఇస్తున్నాడు? అని కొందరు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. వెండితెర ప్రపంచంలో ఇలాంటి తెరచాటు బంధాలు సర్వ సాధారణమే. ఇలా ఖండిస్తూనే కథ నడిపించే కిలాడీలు కూడా సినీ ప్రపంచంలో చాలా మందే ఉన్నారు.


Click it and Unblock the Notifications











