twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రవితేజ 'బలుపు' లో గెస్ట్ గా బాలయ్య హీరోయిన్

    By Srikanya
    |

    హైదరాబాద్: రవితేజ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'బలుపు' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇప్పటికే అంజలి,శృతిహాసన్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. తాజాగా లక్ష్మి రాయ్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ కి ఎంపికైంది. దాంతో ఈ చిత్రానికి మరింత గ్లామర్ అద్దినట్లైందంటున్నారు. లక్ష్మి రాయ్ గతంలో బాలకృష్ణ సరసన.. అధినాయకుడు చిత్రంలో హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే.

    ఇక ఈ చిత్రం ఆడియో లాంచ్ ని మే 30 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వైజాగ్ బ్యాక్ డ్రాప్‍‌తో సాగే ఈ చిత్రంలో చాలా కాలం తర్వాత రవితేజ పూర్తి మాస్ రోల్ చేస్తున్నారు. పివిపి సినిమా బేనర్ పై గతంలో రవితేజతో వీడింతే చిత్రం రూపొందించిన ప్రసాద్ వి.పొట్లూరి ఈ చిత్రానికి నిర్మాత. ఇంతకు ముందు రవితేజతో గోపీచంద్ మలినేని 'డాన్‌శీను' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈచిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రిప్టు రచయితగా పని చేస్తున్నారు.

    ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావు రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, శేఖర్, అజయ్, షఫీ, శ్రీనివాస్ రెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రానికి కథ, మాటలు: కోన వెంకట్, కె. ఎస్. రవీంద్ర, పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భాస్కర భట్ల, ఫైట్స్: స్టన్ శివ, కొరియోగ్రఫీ: రాజు సుందరం, బృందం, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: గౌతం రాజు, సినిమాటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: థమన్, నిర్మాత: పరమ్ వి. పొట్లూరి.

    English summary
    Lakshmi Rai has joined the cast of Ravi Teja's Balupu. The film already has two beautiful heroines - Shruti Haasan and Anjali. With Lakshmi Rai joining them, more glamour is added to Balupu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X