పిచ్చిగాని..పేరు మార్చుకుంటే లక్ మారుద్దా
హైదరాబాద్ : సినిమావాళ్లకున్నన్ని నమ్మకాలు,విశ్వాసాలు బయిటవాళ్లకు ఉండవనేది నిజం. అయితే ఈ వల్లమాలిన నమ్మకాలు ఏర్పడటానికి ఓ రీజన్ ఉన్న రీజనింగ్ ఉంది. ఈ ఫీడ్లులో చాలా సార్లు తమకు సంభధం లేకుండా ఎదగటం,పడిపోవటం జరిగిపోతుంది. అలాగే ఎదుగుదల ఓవర్ నైట్ లో స్టార్ ని చేస్తే...పడిపోవటమూ అంతే స్పీడులో ఓ శుక్రవారం రిలీజ్ తో కూల్ గా జరిగిపోతుంది. అందుకే సినిమావాళ్లు జాతకాలు,జ్యోతిష్యాలు,వాస్తు, న్యూమరాలిజి వంటివి బయిటవారికన్నా ఎక్కువగా నమ్మి ఫాలో అవుతూంటారు.
అసలు విషయంలోకి వస్తే...తాజాగా స్టార్ హీరోయిన్ గా ఎదుగుదామని మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తూ వస్తూ సఫలికృతం కాలేకపోతున్న లక్ష్మి ...తన పేరుని రాయ్ లక్ష్మి గా మార్చుకుంది.ఈ విషయమై ఆమె సన్నిహితులు మాట్లాడుతూ...ఇన్నాళ్లూ సాప్ట్ రోల్స్ చేసాం కాబట్టి లక్ష్మీ రాయ్ అని పెట్టుకుంది. దాంతో ఆమెకు సాఫ్ట్ ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు యాక్షన్ సినిమాలు చేస్తోంది అందుకే రాయ్ లక్ష్మి అని మార్చుకుంది అన్నారు. అయితే ఇదంతా లక్ మారటానికి చేస్తున్న పనే అంటున్నారు. ఇలా పేరు మార్చుకోవటం వల్ల కలిసివస్తుందని చెప్పబట్టే చేసిందంటున్నారు.

'కాంచనమాల కేబుల్ టీవి' చిత్రంతో శ్రీకాంత్ సరసన నటించి తెలుగులో పరిచయమైన లక్ష్మీరాయ్ ఆ సినిమా పరాజయం తో ఇక్కడ నిలదొక్కుకోలేకపోయింది. కానీ పరిశ్రమ దృష్టిలో పడటానికి ఇదో వెహికల్ గా ఉపయోగపడింది.
కెరీర్ లో హిట్టు అనేది కనపడకపోయినా వరస ఆఫర్స్ తో బిజీగా ఉండే హీరోయిన్స్ లో లక్ష్మీ రాయ్ ఒకరు. ఆమె సినిమాలకు తెలుగు,తమిళంలో సమానమైన మార్కెట్ ఉంది. ఒక్క హిట్ పడితే నేనేంటో నిరూపిస్తానంటూ చెలరేగిపోయే ఈ ముద్దుగుమ్మ అందాల ప్రదర్శనలోనూ తోటి హీరోయిన్స్ కి సవాల్ విసురుతూంటుంది. తాజాగా ఆమె 'ఒన్బదుల గురు'అనే తమిళ చిత్రంలో ఫైట్స్ కూడా చేసింది.
అయితే ఆమె ఫైట్స్ చేసినా అందాల ప్రదర్శన అందులో ఇమిడే ఉంటుందని కోలీవుడ్ అంటోంది. ఇప్పటికే ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. తెలుగులోనూ ఈ చిత్రం డబ్బింగ్ అవనుంది.'కాంచన' సహా తమిళంలో నటించినవి కొన్ని సినిమాలే అయినా అందాల ఆరబోతతో తనదైన ముద్ర వేసింది.


Click it and Unblock the Notifications











