చూసినోడికి చూసినంత! బాలయ్యతో పెద్దపాప!

దాదాపు ఏడేళ్ల క్రితం కాంచనమాల కేబుల్ టీవీ చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన లక్ష్మిరాయ్, ఆ చిత్రంలోనే ఫుల్లుగా అందాలు ఆరబోసింది. తర్వాత చాలా చిత్రాల్లో అమ్ముడు అదే రేంజ్‌లో రెచ్చిపోయింది. అయితే ఆ చిత్రాలేవీ పెద్దగా ఆడక పోవడంతో పెద్ద హీరోల చూపులు ఆమె అందాలపై పడలేదు. ఇటీవల వచ్చిన కాంచన చిత్రం మంచి విజయం సాధించడంతో నటసింహం నందమూరి బాలయ్య ఆమెపై ఆసక్తి పెంచుకున్నాడు . తన సినిమా అధినాయకుడు చిత్రంలో లక్ష్మిరాయ్‌ని బాలయ్యే పట్టబట్టి ఎంపిక చేశారు.
ఇటీవల విడుదలైన అధినాయకుడు చిత్రం ట్రైలర్స్, స్టిల్స్ పరిశీలిస్తే బాలయ్య, లక్ష్మి రాయ్ మధ్య మాంచి మూడ్ తెచ్చే హాట్ రొమాంటిక్ అండ్ సెక్సీ సీన్లు చిత్రీకరించారని స్పష్టం అవుతోంది. చిత్రంలోని ఓ వాన పాటలో బాలయ్య లక్ష్మిరాయ్ హాట్ పెర్ఫార్మెన్స్ సర్వత్రా చర్చనీయాంశం అయింది. కొందరు అభిమానులైతే లక్ష్మిరాయ్ షేపులు, ఊపులు పెద్దపాప రేంజ్ లో ఉన్నాయని, సినిమా మాకు పుల్ మీల్స్‌లా ఉండటం ఖాయమని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బాలయ్య సరసన అవకాశం రావడంతో గతంలో కంటే మరింత రెచ్చపోయి చూసినోడికి చూసినంత అన్నచందంగా అందాలు ఆరబోస్తున్న లక్ష్మిరాయ్‌కి ఈ సినిమా ఏమేరకు ప్లస్సవుతుందో చూడాలి. పరుచూరి మురళి దర్శకత్వం వహిస్తున్న అధినాయకుడు చిత్రాన్ని ఎం.ఎల్.కుమార్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. లక్ష్మిరాయ్, సలోని హీరోయిన్లు. కళ్యాణి మాలిక్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











