రేప్‌కి రెడీ అంటున్న హీరోయిన్ లక్ష్మీ రాయ్!
హైదరాబాద్ : ఇటీవల జరిగిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలిన నిర్భయకు యావత్ దేశం అండగా నిలిచింది. ఆమెకు న్యాయం జరుగాలంటూ భారత సమాజం మొత్తం రోడ్డెక్కి నిరసన తెలిపింది. యువతరం ఉప్పెనలా మారి పార్లమెంటును ముట్టడించింది. రేప్ సంఘటనపై దేశ చరిత్రలో ఇలాంటి స్పందన రావడం ఇదే తొలిసారి.
దీంతో సినిమా వాళ్ల కన్ను కూడా ఢిల్లీ రేప్ సంఘటనపై పడింది. సినీ తారలు కూడా నిర్భయకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. కొందరు దర్శకుడు ఢిల్లీ రేప్ ఘటనపై సినిమాలు తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సంఘటనపై హీరోయిన్లు లక్ష్మీరాయ్, పియా బాజ్ పాయ్ మాట్లాడుతూ....ఢిల్లీ రేప్ సంఘటనపై సినిమా తీస్తే మేము రేప్ బాధితురాలి పాత్రలో నటించడానికి రెడీ అంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేసారు.
ఢిల్లీ రేప్ సంఘటనపై సినిమాలు తీయడం వలన సమాజంలో చైతన్యం వస్తుందని, భవిష్యత్‌లో ఇలాంటి సంఘనలు చోటు చేసుకోకుండా సినీ మాధ్యమాన్ని ఉపయోగించుకోవచ్చని ఆ రంగానికి చెందిన వారు అభిప్రాయ పడుతున్నారు. కాగా...ఢిల్లీ రేప్ సంఘటనపై సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు దర్శకుడు అల్లాని శ్రీధర్.స
ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటన నేపథ్యంలో తాను ఈచిత్రాన్ని రూపొందించబోతున్నాను. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. నేను దీన్ని నార్మల్ కమర్షియల్ సినిమాలా కాకుండా యువతకు సందేశాన్ని ఇచ్చే చిత్రంగా తెరకెక్కించబోతున్నాను' అని అల్లాని శ్రీధర్ చెప్పుకొచ్చారు.
దర్శకుడు, నిర్మాత అయిన అల్లాని శ్రీధర్ గతంలో నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన కొమురంభీం జీవితంపై సినిమాను రూపొందించారు. అదే విధంగా గౌతమ బుధ్దుడిపై చరిత్రాత్మక చిత్రాన్ని కూడా రూపొందించారు. తాజాగా శ్రీధర్ ఎంతో సున్నితమైన ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై సినిమాను రూపొందించబోతున్నారు.


Click it and Unblock the Notifications












