Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మరీ అంత సెక్సీ సినిమా తర్వాత లక్ష్మీ పార్వతి పాత్రా??
ప్రస్తుతానికి టాలీవుడ్ లో ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ల "సిరీస్" హవా నడుస్తోంది. ఒక పక్క బాలయ్య తేజా కాంబినేషన్ లో ఒక బయోపిక్ వస్తుందన్న విషయమూ, అదే సమయం లో రామ్ గోపాల్ వర్మ దానికి పోటీగా లక్ష్మీ'స్ .
Recommended Video
ప్రస్తుతానికి టాలీవుడ్ లో ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ల "సిరీస్" హవా నడుస్తోంది. ఒక పక్క బాలయ్య తేజా కాంబినేషన్ లో ఒక బయోపిక్ వస్తుందన్న విషయమూ, అదే సమయం లో రామ్ గోపాల్ వర్మ దానికి పోటీగా లక్ష్మీ'స్ ఎన్టీఆర్ మొదలు పెట్టిన సంగతీ తెలిసిందే.
ఆసక్తి ఏమాత్రం తగ్గటం లేదు
అయితే అప్పటి వరకూ సినిమా అంశంగానే ఉన్న ఈ బయోపిక్ ఎప్పుడైతే వర్మకి మద్దతుగా వయ్యెస్సార్ పార్టీ ఉందన్న విషయం బయటికి వచ్చిందో అప్పుడే రాజకీయ రంగు పులుముకుంది. ఇన్ని సినిమాల రిలీజ్ లూ, కలెక్షన్లూ, హిట్ లూ. ఫట్ లూ అన్నిటి మధ్య కూడా ఈ సినిమా మీద ఉన్న ఆసక్తి ఏమాత్రం తగ్గటం లేదు.
ఎన్టీఆర్ బయోపిక్
అదీ ఏక కాలం లో ఒకే సబ్జెక్ట్ మీద సినిమాలు రావటం కూడా ఇదే మొదటి సారేమో. ఒకదానికి ఎక్కువా ఒక దానికి తక్కువా అనికాదు ఎన్టీఆర్ జీవితం మీద వస్తున్న ఈ మూడు సినిమాలూ దేనికదే ప్రత్యేకం అన్నంత ఆసక్తిని క్రియేట్ చేసుకున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో నాలుగు సినిమాలు తెరకెక్కబోతోన్న విషయం తెలిసిందే.
లక్ష్మీస్ వీరగ్రంథం
మూడు సినిమాలు ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వం చేస్తున్న ‘లక్ష్మీస్ వీరగ్రంథం' చిత్రం పూజా కార్యక్రమాలు జరుపుకుని రెగ్యులర్ షూటింగ్‌కి రెడీ కాబోతుంది. అయితే ఈ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్ర కోసం నటి వాణీ విశ్వనాధ్‌ని దర్శకుడు సంప్రదించినట్లుగా వార్తలు వచ్చాయి.
లక్ష్మీపార్వతి పాత్ర కోసం
ఆ తర్వాత వాణీ విశ్వనాధ్ కూడా ఈ వార్తలు నిజమే అని తెలిపింది. ఆ పాత్రలో నటించడానికి రెడీగా ఉన్నానంటూ కూడా ఆమె తెలిపింది. కానీ లక్ష్మీపార్వతి పాత్ర కోసం దర్శకుడు కేతిరెడ్డి ఓ యంగ్ హీరోయిన్ని తీసుకోబోతున్నాడనే వార్తలు తాజాగా సోషల్ మీడియాలో సంచరిస్తున్నాయి.
లక్ష్మీపార్వతి పాత్ర కోసం
"కాటమరాయుడు, ఖైదీ నెంబర్ 150" చిత్రాలలో స్పెషల్ సాంగ్‌లలో నర్తించిన రాయ్ లక్ష్మీని "లక్ష్మీస్ వీరగ్రంథం" సినిమాలోని లక్ష్మీపార్వతి పాత్ర కోసం తీసుకున్నారని, ఈ పాత్రలో చేయడానికి ఆమె అంగీకారం తెలిపిందనే వార్తలు తాజాగా వ్యాపించాయి.
"జూలీ 2" విడుదలకు సిద్ధం
ప్రస్తుతం రాయ్ లక్ష్మీ నటించిన "జూలీ 2" సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. మరి వినిపిస్తున్న వార్తలు నిజమే అయితే మాత్రం ఈ ప్రాజెక్ట్ మరింత సంచలనం కానుంది. మరి ఈ వార్తలు ఎంత వరకు నిజమో తెలియాలంటే మాత్రం కేతిరెడ్డి నుండి కబురు రావాల్సిందే.