ధోని ప్రియురాలు అందంగా ఉందనే వీసా ఇవ్వలేదంటా....?
శ్రీకాంత్ హీరోగా కాంచనమాల కేబుల్ టివి చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన లక్ష్మీరాయ్..తను నటించిన చిత్రాల ద్వారా కంటే.. క్రికెట్ కలల రాకుమారుడు ధోనీ ప్రియురాలిగానే సుపరిచితురాలు. 'క్రిష్టియన్ బ్రదర్స్' అనే మలయాళ చిత్రం కోసం బ్రిటన్ వెళ్లేందుకు వీసా కోసం లక్ష్మీరాయ్ అప్లయి చేసుకుంది. అయితే బ్రిటన్ ఎంబసీవారు ఒక విచిత్రమైన కారణంతో ఆమెకు వీసా తిరస్కరించడం ద్వారా బోలెడంత ఉచిత ప్రచారం కల్పిస్తున్నారు.
'లక్ష్మీ రాయ్ చాలా అందంగా ఉన్నందున..ఆమె తమ దేశంలో ఎవరినైనా కొంగుకు కట్టేసుకుని, అక్కడే సెటిలైపోయే ప్రమాదముంది కాబట్టి.. ఆమెకు వీసా నిరాకరిస్తున్నామని సదరు ఎంబసీ పేర్కొంది. నిజానికి నిర్మాతలు వీసాకు అవసరమైన పత్రాలు సమర్పించి ఉండరని, ఆ విషయం నేరుగా చెప్పకుండా.. లక్ష్మీరాయ్‌పై మనసు పారేసుకున్న ఎవరో ఓ చిలిపి ఆఫీసర్ పై కారణాన్ని ఉదహరించి ఉంటాడని తెలుస్తోంది. పైన పేర్కొన్న కారణం నిజమే అయితే.. ఐశ్వర్యరాయ్‌కు ఏ దేశం కూడా వీసా మంజూరు చేయకూడదు కదా?


Click it and Unblock the Notifications











