హాట్ లక్ష్మీరాయ్...గ్యాంగ్‌రేప్ బాధితురాలు ?

By Srikanya

హైదరాబాద్: డిల్లీలో ఓ యువత బస్‌లో గ్యాంగ్ రేప్‌కు గురైన సంఘటన గత కొన్ని వారాలుగా దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. దేశాన్నంతా కుదిపేసిన ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఉదంతం ఆధారంగా ఓ చిత్రాన్ని తీసేందుకు మలయాళ దర్శకుడు జి.యస్. వేణు సన్నాహాలు చేస్తున్నాడు. గ్యాంగ్‌రేప్‌కు గురైన తర్వాత సింగపూర్‌లోని ఆస్పత్రిలో మరణించేంత వరకు ధైర్యాన్ని సడలించని యువతి పాత్రను చేయడానికి లక్ష్మీరాయ్ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

ఈ పాత్ర విషయంలో ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వేణు తెలిపాడు. సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న దారుణ సంఘటనలపై జనంలో చైతన్యం కలిగించడానికి ఈ సినిమా ఉపకరిస్తుందని ఆయన భావిస్తున్నాడు. నాలుగు దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించాలనేది వేణు సంకల్పం అని తెలుస్తోంది.

మరో ప్రక్క ఈ ఘటనపై ఛార్మి ప్రధాన పాత్రలో తెలుగు సినిమా రాబోతోంది. గతంలో కొమురంభీం జీవితంపై సినిమాను, గౌతమ బుధ్దుడిపై చరిత్రాత్మక చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అల్లాని శ్రీధర్ ఈచిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో అల్లాని శ్రీధర్ హీరోయిన్ ఛార్మిని ఈ వివాదాస్పద సినిమాలో లీడ్ రోల్ హీరోయిన్ గా తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

గ్యాంగ్ రేప్‌ లో తీవ్ర గాయాల పాలైన యువతి ప్రాణాలతో పోరాడి చివరకు తుది శ్వాస విడిచింది. ఈ దారుణ ఘటన దేశం మొత్తాన్ని కదిలించింది. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పార్లమెంటు ముట్టడికి దారి తీసింది. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికతో అల్లాని శ్రీధర్ మాట్లాడుతూ... ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై సినిమా తీయబోతున్నట్లు స్పష్టం చేసారు. ప్రస్తుతం తన టీం స్క్రిప్టు వర్కులో బీజీగా ఉన్నట్లు వెల్లడించారు. అదే విధంగా ఈ సినిమాలో ఛార్మిని హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X