»   »  సెక్సీ లుక్... అంతా చిరంజీవి కూతురు టాలెంటే!

సెక్సీ లుక్... అంతా చిరంజీవి కూతురు టాలెంటే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ల్యాండ్ మార్క్ మూవీ 'ఖైదీ నెం.150' చిత్రం షూటింగ్ శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికి విడుదల చేసేందుకు నిర్మాత రామ్ చరణ్ ప్రయత్నిస్తున్నారు.

కాగా ఈ మధ్య కాలంలో చిరంజీవి 150వ సినిమా సెట్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసకుంటున్నాయి. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తొలుత హీరోయిన్ కేథరిన్ ను తీసుకున్నప్పటికీ సెట్స్ లో డాన్స్ మాస్టర్ లారెన్స్‌తో విబేధాల కారణంగా ఆమె స్థానంలో లక్ష్మీ రాయ్ ని తీసుకున్న సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో స్పెషల్ సాంగుకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. లక్ష్మీరాయ్ సెట్స్ లో జాయిన్ అయిన వెంటనే ఆమె ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్టు చేసారు.

 లక్ష్మీరాయ్ సెక్స్ లుక్

లక్ష్మీరాయ్ సెక్స్ లుక్

ఖైదీ నెం.150లో ని స్పెషల్ సాంగులో లక్ష్మీ రాయ్ హాట్ అండ్ సెక్సీ లుక్ తో అభిమానులను అలరించబోతోంది. సాధారణంగానే లక్ష్మీరాయ్ యమ హాటుగా ఉంటుంది. ఇందులో ఆమె అందాల ఆరబోత పరంగా అభిమానుల్లో హీట్ పుట్టించనుందట.

 చిరంజీవి కూతురు టాలెంటే

చిరంజీవి కూతురు టాలెంటే

చిరంజీవి పెద్ద కూతురు సుష్మితా ఈ సినిమాకు స్టైలిస్ట్ గా పని చేస్తున్నారు. లక్ష్మీరాయ్ సుష్మితా గురించి ట్విట్టర్లో చెబుతూ... ‘లెజెండ్ చిరంజీవిగారి సినిమాలో చేయడం అనేది నా డ్రీమ్. 150వ సినిమాతో ఆ కల నేరవేరుతోంది. సుష్మితాచిరంజీవి నన్ను ఎంతో స్టైలిష్ గా తయారు చేసింది. చాలా కొత్త లుక్ తో మీకు కనిపించబోతున్నాను' అంటూ లక్ష్మీరాయ్ ట్వీట్ చేసింది.

రాఘవ లారెన్స్

రాఘవ లారెన్స్

సౌత్ డాన్స్ లకు విషయంలో చిరంజీవి తర్వాతే ఎవరైనా. మరి ఆయనకు రాఘవ లారెన్స్ కొరియోగ్రఫీ తోడైతే అదిరిపోవాల్సిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన డాన్స్ నెంబర్లన్నీ కేక. ఇంద్ర సినిమాలో వీణ స్టెప్ అయితే ఎవర్ గ్రీన్. చిరు 150వ సినిమాలో కూడా రాఘవ లారెన్స్ చిరంజీవితో ఎప్పటికీ గుర్తుండిపోయే స్టెప్స్ వేయించబోతున్నాడు.

 ఫుల్లీ లోడెడ్ ఎంటర్టెనర్

ఫుల్లీ లోడెడ్ ఎంటర్టెనర్

చిరంజీవి కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో దర్శకుడు వివి వినాయక్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అభిమానులు మెచ్చేలా మాస్, క్లాస్, ఫ్యామిలీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఇష్టపడేలా సినిమాను ఎంటర్టెన్మెంటుతో తెరకెక్కిస్తున్నారు.

English summary
"Day dreaming !!! On the sets of #KhaidiNo150 with the legend #Chiranjeevi garu ! beautifully styled by #sushmitachiranjeevi #lovingit," Raai tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu