తెలుగు హీరోలు ఇగోయిస్ట్‌లని..లక్ష్మీ రాయ్
తెలుగు హీరోలు ఇగోయిస్ట్‌లని.. ఇక్కడ మేల్ డామినేషన్ ఎక్కువ అని నాతో చాలామంది అన్నారు అయితే వారితో నాకు ఎలాంటి సమస్యా ఎదురుకాలేదు అంటూ తెలుగులో తాను నటించిన రోజులని గుర్తు చేసుకుంది లక్ష్మీ రాయ్. కాంచనమాల కేబుల్ టీవి చిత్రంతో తెలుగుకి పరిచయమైన ఆమె ఆ తర్వాత ఒకట్రెండు చిత్రాల్లో మెరిసింది. ఇక ప్రస్తుతం ఆమె బాలకృష్ణ సరసన పరుచూరి మురళి దర్శకత్వంలో ఎం.ఎల్. కుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తోంది. తెలుగులో చాలాకాలం తర్వాత స్ట్రయిట్ సినిమాలో నటిస్తుండడం ఆనందంగా ఉందని ఆమె అంటోంది. అలాగే అందాల ఆరబోత గురించి చెబుతూ...గ్లామరస్ హీరోయిన్లను చూడ్డానికే యూవత సినిమాలకు వస్తారన్నది నా అభిప్రాయం. అందుకే గ్లామర్‌గా కనిపించి వాళ్ల ఆకట్టుకోవాలనుకుంటాను. అది తప్పుగా అనిపించదు. సెక్సీగా కనిపించడానికి ఇష్టపడతాను కానీ అసభ్యతకి మాత్రం దూరంగా ఉంటాను అంది.
లక్ష్మీరాయ్ బాలకృష్ణ కాంచనమాల కేబుల్ టీవి సూపర్ కౌబాయ్ lakshmi rai balakrishna kanchanamala cable tv super cowboy


Click it and Unblock the Notifications