త్రిష పెళ్లి గురించి...లక్ష్మిరాయ్ ఆశ్చర్యకరమైన ట్వీట్!

By Bojja Kumar

హైదరాబాద్: చెన్నై బ్యూటీ త్రిషకు ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని కోలీవుడ్ మీడియా హడావిడి చేసిన సంగతి తెలిసిందే. 'వాయై మూడి పేసవుం' నిర్మాత, పారిశ్రామికవేత్త వరుణ్‌ మణియన్‌తో నిశ్చితార్థం జరిగిందని ఆ వార్తల సారాంశం. త్వరలోనే వీరు పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. అయితే మీడియాలో వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని త్రిష, ఆమె తల్లి ఉమాకృష్ణన్‌ స్పష్టం చేసారు. ఉమాకృష్ణన్‌ మాట్లాడుతూ.. 'అవాస్త ప్రచారం సాగుతోంది. త్రిష జీవితంలో ఇలాంటి ఘట్టం వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్క మీడియాకు చెబుతాను. అందులో సందేహం లేదు'ని అన్నారు.

మరోవైపు మరోవైపు త్రిష, వరుణ్‌ అన్యోన్యంగా ఉన్నారంటూ వచ్చిన ఫొటోలు కూడా ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అంతేకాకుండా అమ్మడు నిశ్చితార్థ ఉంగరంతో ఉన్నట్లు వచ్చిన ఛాయాచిత్రాలు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. 'నాకు నిశ్చితార్థం అయినట్లు వస్తున్న వార్త నిజం కాదు. అలాంటి విషయం జరిగితే.. ఆ సమాచారం తొలుత నా నుంచే బయటకు వస్తుంద'ని త్రిష ట్విట్టర్‌లో ప్రస్తావించారు.

Lakshmi Rai Tweet about Trisha Marriage

ఇదిలా ఉంటే....హీరోయిన్ లక్ష్మిరాయ్ ట్వీట్స్ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. "One should hv the balls to accept the truth abt their personal life! Surprised! why someone would lie abt a situation which is true??#fake" అంటూ ఆమె ట్వీట్ చేసారు. త్రిష గురించి లక్ష్మీరాయ్ చేసిన ట్వీట్ పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.

లక్ష్మి రాయ్ చేసిన ట్వీట్ త్రిష-వరుణ్ ఏంగేజ్మెంట్ త్వరలోనే జరుగుతుందనే రూమర్లకు బలం చేకూరే విధంగా ఉందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X