For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సెక్సీ లక్ష్మీరాయ్ బలుపు చూస్తిరా..!(ఫోటోలు)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న 'బలుపు' చిత్రంలో హాట్ అండ్ సెక్సీ హీరోయిన్ లక్ష్మీరాయ్ గెస్ట్‌రోల్‌తో, స్పెషల్ సాంగు చేస్తున్న సంగతి తెసిందే. ఇటీవలే లక్ష్మీరాయ్ నటించే సన్నివేశాలు, సాంగు చిత్రీకరణ జరిపారు. ఈ సందర్భంగా లక్ష్మీరాయ్ బలుపు యూనిట్ సభ్యులతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

  ఈ చిత్రంలో అంజలి, శృతిహాసన్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. ఈ ఇద్దరు హీరోయిన్ల అందాలకు లక్ష్మీరాయ్ గ్లామర్ కూడా తోడు కావడంతో బలుపు చిత్రం అభిమానులకు అందాల విందు చేయడం ఖాయం అంటున్నారు సినీ వర్గాలు. అంచనాలకు తగిన విధంగానే దర్శకుడు గోపీచంద్ మలినేని మసాలా దట్టించిన సీన్లు ఈ చిత్రంలో ప్లాన్ చేసాడట.

  వైజాగ్ బ్యాక్ డ్రాప్‍‌తో సాగే ఈ చిత్రంలో చాలా కాలం తర్వాత రవితేజ పూర్తి మాస్ రోల్ చేస్తున్నారు. పివిపి సినిమా బేనర్ పై గతంలో రవితేజతో వీడింతే చిత్రం రూపొందించిన ప్రసాద్ వి.పొట్లూరి ఈ చిత్రానికి నిర్మాత. ఇంతకు ముందు రవితేజతో గోపీచంద్ మలినేని 'డాన్‌శీను' చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈచిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ స్క్రిప్టు రచయితగా పని చేస్తున్నారు.

  ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, రావు రమేష్, అలీ, అశుతోష్ రాణా, అడవి శేషు, సుప్రీత్, ఆదిత్య మీనన్, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, శేఖర్, అజయ్, షఫీ, శ్రీనివాస్ రెడ్డి, సన, రాజశ్రీ నాయర్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రానికి కథ, మాటలు: కోన వెంకట్, కె. ఎస్. రవీంద్ర, పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, భాస్కర భట్ల, ఫైట్స్: స్టన్ శివ, కొరియోగ్రఫీ: రాజు సుందరం, బృందం, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: గౌతం రాజు, సినిమాటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: థమన్, నిర్మాత: పరమ్ వి. పొట్లూరి.

  బలుపు చిత్ర టీంతో కలిసి లక్ష్మీరాయ్

  స్పెషల్ సాంగు చిత్రీకరణలో లక్ష్మీరాయ్ ఇదే డ్రెస్ లో సెక్సీగా ప్రేక్షకులను అలరించనుంది.

  'కాంచనమాల కేబుల్ టీవి' చిత్రంతో శ్రీకాంత్ సరసన నటించి తెలుగులో పరిచయమైన లక్ష్మీరాయ్ ఆ సినిమా పరాజయం తో ఇక్కడ నిలదొక్కుకోలేకపోయింది. కానీ పరిశ్రమ దృష్టిలో పడటానికి ఇదో వెహికల్ గా ఉపయోగపడింది.

  ప్రభాస్ హీరోగా వచ్చిన పౌర్ణమి,బాలకృష్ణతో అథినాయకుడు చిత్రాలు చేసిది. కానీ సినిమాలు పెద్ద ప్లాప్ కావటంతో ఆమెను గుర్తు పెట్టుకున్న వారు లేరు.

  పూర్తిగా ఖాళీ పడిపోయిన టైమ్ లో మరో సారి సినీ జీవితాన్ని ప్రసాదించాడు లారెన్స్. ఆయన తన హిట్ కాంచనతో లక్ష్మీరాయ్ మళ్ళీ గుర్తింపు తెచ్చి పెట్టాడు. లారెన్స్ తో ఆమె వరసగా మూడు సినిమాలు చేసింది.

  'ఓ పాట పాడామా, ఓ ఆట ఆడామా...అన్నట్టుండే కథలు నేను ఒప్పుకోను. నేను వేసే రోల్‌ తప్పకుండా కథలో భాగమవ్వాలి. ప్రాధాన్యత కలిగి ఉండాలి. అలా లేకపోతే...లక్ష్మీరాయ్ చేసింది కదా అన్న పేరు ఎలా వస్తుంది. ప్రత్యేకతే లేకపోతే ప్రేక్షకులు హర్షించరు' అని భారీ ఎత్తున స్టేట్ మెంట్ ఇచ్చింది

  'నీ ఫిజిక్ భలే బాగుంది.."అని ప్రపంచ ప్రసిద్ధి పొందిన 'టైటానిక్" దర్శకుడు జేమ్స్ కామరూన్ ప్రసంసించడం ఆమె జీవితంలో మర్చిపోలేని విషయమంటుంది. దుబాయ్‌ లో జరిగిన '2011 అబుదాబి మీడియా సమ్మిట్" కార్యక్రమంలో పాల్గొనటానికి వచ్చిన కామరూన్ ఆమెను చూసి ఇలా స్పందించారు.

  క్రికటర్‌తో ఆమె రిలేషన్ కు ఫుల్ స్టాఫ్ పడకుండానే..ఫిజకల్ ఫిటనెస్ ట్రైనర్ ప్రశాంత్ తో వ్యవహారం నడిపిస్తోందంటూ వార్తలు వచ్చాయి.

  లక్ష్మీరాయ్

  లక్ష్మీరాయ్

  English summary
  Lakshmi Rai is doing a special character in Balupu film which includes a song as well. Lakshmi Rai has joined the cast of Ravi Teja's Balupu. Here are the photo of Lakshmi Rai with the team of Balupu. The film already has two beautiful heroines - Shruti Haasan and Anjali.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X