'ఉయ్యాల జంపాల' హీరోయిన్ మళ్ళీ ఇరగతీసింది(వీడియో)
హైదరాబాద్: గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై నంద్యాల రవి దర్శకత్వంలో గిరిధర్ మామిడిపల్లి రూపొందిస్తున్న చిత్రం ‘లక్ష్మీ రావే మా ఇంటికి'. శౌర్య, అవికాగోర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ గా మారింది. అచ్చ తెలుగుతనం ఉట్టిపడుతున్న చిత్రంగా ఈ టీజర్ ద్వారా సినిమా ప్రమోట్ అవుతోందంటున్నారు. మీరు కూడా ఈ టీజర్ పై ఓ లుక్కేయండి మరి..
నిర్మాత గిరిధర్ మాట్లాడుతూ- ఓ మంచి కథాంశంతో సినిమా రూపొందించాలన్న తన కోరిక ఈ చిత్రంతో నెరవేరుతుందని, దర్శకుడు రవి మంచి కథ చెప్పడంతో మొదలెట్టామని, అవికాగోర్ హీరోయిన్ గా నటిస్తుండడంతో ఈ చిత్రానికి మరింత అందం వచ్చిందని తెలిపారు. ‘ఇడియట్'లో రవితేజకు వచ్చినంత పేరు కథానాయకుడు శౌర్యకు ఈ చిత్రం ద్వారా వస్తుందని, ఆయన అన్నారు.

కుటుంబమంతా కలిసి చూసే విధంగా ఈ చిత్రాన్ని లవ్ ఎంటర్‌టైనర్‌గా అందిస్తున్నామని, మంచి టీమ్ కుదరడంతో సినిమా కూడా బాగా వస్తుందన్న నమ్మకం ఉందని దర్శకుడు నంద్యాల రవి తెలిపారు.
ఈ సినిమాలో తన పాత్ర గూర్చి తెలియగానే ఆ పాత్రతోనే తాను ప్రయాణిస్తున్నానని, అంతగా నచ్చిన ఈ పాత్ర సినిమా అందరికీ నచ్చుతుందన్న ఆశాభావం హీరోయిన్ అవికాగోర్ వ్యక్తం చేసింది.
అలీ, ముఖేష్ రుషి, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కె.ఎమ్.రాధాకృష్ణ, కెమెరా: సాయిశ్రీరామ్, పాటలు: భాస్కరభట్ల, వనమాలి, నిర్మాత: గిరిధర్ మామిడిపల్లి, దర్శకత్వం: నంద్యాల రవి.


Click it and Unblock the Notifications











