మంచు లక్ష్మిని ఫాలో అవుతున్న నరేంద్రమోడీ
హైదరాబాద్ : లక్ష్మీ ప్రసన్న ట్విట్టర్ కళతో మెరిసిపోతోంది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి క్రియాశీలకంగా ఉంటారు. అందులో అతణ్ని అనుసరించేవారు సుమారు 22 లక్షల మంది. ఆయన అసుసరించేది మాత్రం 671 ప్రముఖులనే. ఆ జాబితాలో స్థానం సంపాదించుకుంది మంచు మోహన్ బాబు కుమార్తె లక్ష్మీప్రసన్న.
ఈ విషయమై లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ ''రాఖీ పండగ సందర్భంగా మోడి 28 మంది మహిళల్ని ట్విట్టర్ వేదికలో అనుసరించారు. అందులో నేనూ ఒకరిని కావడం ఆనందంగా ఉంది. నాకిది ఆయనిచ్చిన కానుకగా భావిస్తున్నా ను'' అని తెలిపింది.

'అనగనగా ఓ ధీరుడు'చిత్రంతో నటిగా తానేంటో ప్రూవ్ చేసుకున్న లక్ష్మీ ప్రసన్నకు నటన అనేది బ్లడ్ లోనే ఉందని చెప్పాలి. మోహన్ బాబు కుమార్తెగా పరిశ్రమలో ప్రవేశించిన ఆమె తన నటనకు గానూ నంది అవార్డు సాధించింది. నిర్మాతగానూ వరసగా సినిమాలు తీస్తూ వార్తల్లో నిలుస్తోంది. విభిన్నమైన చిత్రాలకు ఆమె తన బ్యానర్ ని వేదికగా మార్చింది.'అనగనగా ఓ ధీరుడు'లో ఐరేంద్రి పాత్రతో 2011 ఉత్తమ ప్రతినాయిక నందికి ఎంపికైంది.
అలాగే అప్పుడప్పూడ ఆమె ఫోటో షూట్ తో గ్లామర్ లో నూ మిగతా హీరోయిన్స్ తో పోటీ ఇస్తానంటోంది. మంచు లక్ష్మికి మొదటి నుంచి మోహన్ బాబు కుమార్తెగా కాక తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని కోరుకుంది. అదే దారిలో ఆమె నటిగా ప్రూవ్ చేసుకుని తన తండ్రి అన్ని సంవత్సరాల కెరీర్ లో దొరకని నంది అవార్డుని సంపాదించుకుంది. తండ్రి బాటలోనే విలన్ గా ఎంపికవటం సంతోషమంటోంది. అలాగని ఆమె చూపు గ్లామర్ వైపు లేదనుకోకూడదు. ఆమె నటిస్తూ,నిర్మిస్తున్న గుండెల్లో గోదావరి చిత్రంతో ఆమె తెలుగువారి గుండెల్లో కొలువు ఉన్నానని ధీమాగా చెప్తోంది. మరో ప్రక్క తన పేరు మీద ఓ బ్రాండ్ తో ఫెరఫ్యూమ్స్ వదులుతూ మార్కెట్లో తాను ఎవరికీ తీసిపోనని నిరూపిస్తోంది.


Click it and Unblock the Notifications











