twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లక్ష్మీస్ ఎన్టీఆర్: చంద్రబాబు పాత్ర పోషించిన శ్రీతేజ్ బ్యాగ్రౌండ్ గురించి తెలుసా?

    |

    'లక్ష్మీస్ ఎన్టీఆర్'‌లో ఎన్టీ రామారావు అల్లుడు చంద్రబాబు పాత్ర పోషించిన శ్రీతేజ్... మూవీ రిలీజ్ తర్వాత ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు. ఇతడి రూపం సినిమాలో అచ్చు గుద్దినట్లు చంద్రబాబులా ఉండటం, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ తీరు సూపర్బ్ అనేలా ఉండటంతో అసలు ఎవరీ శ్రీతేజ్? రామ్ గోపాల్ వర్మ ఇతడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనే చర్చ ఇండస్ట్రీలో సాగుతోంది. తాజాగా ఓ వెబ్ ఇంటర్వ్యూలో శ్రీతేజ్ మాట్లాడుతూ తన సినిమా కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

    2006లోనే ఇండస్ట్రీకి...

    2006లోనే ఇండస్ట్రీకి...

    2006లో ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాకు డైరెక్టర్ సెల్వరాఘవన్ టీంలో దర్శకత్వ శాఖలో చేరాను. అలా ఇండస్ట్రీలో నా కెరీర్ మొదలైంది. తర్వాత అదే బేనర్లో తనీష్ హీరోగా రూపొందిన ‘మౌనరాగం' అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసినట్లు శ్రీతేజ్ తెలిపారు.

    దర్శకుడిగా శ్రీతేజ్

    దర్శకుడిగా శ్రీతేజ్

    అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన తర్వాత శ్రీశైలం టెంపుల్ మీద డాక్యుమెంటరీని సొంతగా డైరెక్ట్ చేయడంతో పాటు మరికొన్ని డాక్యుమెంటరీలు చేశాను. దీంతో పాటు ప్రైవేట్ ఆల్బమ్స్ డైరెక్ట్ చేశాను. ఈ అనుభవం అంతా తనకు ఇపుడు నటుడిగా చాలా హెల్ప్ అవుతుందని శ్రీతేజ్ వెల్లడించారు.

    ఏడేళ్ల తర్వాత పిలిచి హీరోగా అవకాశం

    ఏడేళ్ల తర్వాత పిలిచి హీరోగా అవకాశం

    ‘ఆడవారి మాటలకు అర్థరాలే వేరులే' మూవీ చేస్తున్న సమయంలోనే... ఒక అన్న పరిచయం అయ్యారు. ‘బ్రదర్ నేను సినిమా తీస్తే నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా అన్నాడు'. 2006లో అలా నాకు చెప్పిన ఆ వ్యక్తి గుర్తు పెట్టుకుని నాకు ఫోన్ చేసి 2013లో నన్ను హీరోగా పెట్టి ‘నా సామిరంగ' సినిమా చేశారు. అది రిలీజైనప్పటికీ సక్సెస్ సాధించలేదని శ్రీతేజ్ తెలిపారు.

    అవకాశం వస్తే హీరోగా

    అవకాశం వస్తే హీరోగా

    కొందరు నాది హీరో పర్సనాలిటీ అంటున్ననారు. ఒక వేళ హీరోగా అవకాశం వస్తే అస్సలు వదులుకోను. నటుడిగా మరింత పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నటుడిగానే కెరీర్ సాగించాలనుకుంటున్నట్లు శ్రీతేజ్ తెలిపారు.

    లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రాజెక్టులోకి ఇలా...

    లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రాజెక్టులోకి ఇలా...

    నేను వంగవీటి చిత్రంలో నటించిన తర్వాత ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీ అనౌన్స్ చేశారు. అప్పటికి నాకు సినిమా గురించి ఏమీ తెలియదు. చంద్రబాబు నాయుడు పాత ఫోటోలు, నా పాత ఫోటోలు చూడటానికి అచ్చం ఒకేలా ఉంటాయి. వెంటనే నా ఫోటోలన్నీ అగస్త్య మంజు(డైరెక్టర్) అన్నకు పంపాను. కానీ నాకు అవకాశం రాలేదు. వేరెవరినో ఆ పాత్ర చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఆ విషయాన్ని లైట్ తీసుకుని.. ఎన్టీఆర్- కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు చేస్తుండగా డిసెబర్ 6న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' టీమ్ నుంచి కాల్ వచ్చిందని, అలా ఈ ప్రాజెక్టులోకి ఎంటరైనట్లు శ్రీతేజ్ తెలిపారు.

    English summary
    Actor Sri Tej about Lakshmi's NTR Movie and his careen in Film Industry. Sri Tej play as Nara Chandrababu Naidu in Lakshmi's NTR Movie. It is directed by Ram Gopal Varma, Agasthya Manju and produced by Rakesh Reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X