twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘‘ఎన్టీఆర్ చెప్పారు.. చంద్రబాబు ఓటమికి కారణం అదే’’

    |

    Recommended Video

    RGV Sensational Tweets On Chandrababu Naidu & TDP Defeat || Filmibeat Telugu

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని అధికార తెలుగు దేశం పార్టీ చిత్తుగా ఓడిపోయింది. 175 సీట్లకుగాను కేవలం 23 స్థానాలు మాత్రమే రావడంతో అధికారం కోల్పోయింది. చంద్రబాబు ఓటమికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ... దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మెయిన్ రీజన్ అంటున్నారు.

    ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉండే ఆర్జీవీ... చంద్రబాబు ఓటమిపై ఆసక్తికర ట్వీట్లతో రెచ్చిపోతున్నారు. గురువారం ఉదయం నుంచే టీడీపీ ఓటమి దిశగా అడుగులు వేస్తుంటే ఆయన సంబురంగా ట్వీట్స్ చేయడం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం కూడా వర్మ ట్వీట్ల పరంపర కొనసాగుతోంది.

    అందుకే ఓడించినట్లు ఎన్టీఆర్ చెప్పారు

    ‘‘నిన్న రాత్రి స్వర్గీయ ఎన్.టీ.ఆర్ గారు నా కలలోకి వచ్చి ‘‘లక్ష్మీస్ ఎన్.టీ.ఆర్'' విడుదల ఆపినందుకే CBN ని దారుణంగా ఒడిపోయేలా చేశానని చెప్పారు.'' అంటూ రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. ఈ చిత్రం ఎన్టీ రామారావుపై జరిగిన వెన్నుపోటు ఉదంతాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తూ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

    బాబు ప్రజెంట్ పొజిషన్ ఇదీ....

    బాబు ప్రజెంట్ పొజిషన్ ఇదీ అంటూ ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ఓ ఫన్నీ వీడియో షేర్ చేశారు. ఇందులో చంద్రబాబును పోలిన వ్యక్తి ఒకరు హోటల్‌లో వెయిటర్‌గా కనిపించడం గమనార్హం. ఈ వీడియోపై సోషల్ మీడియాలో ఓ రేంజిలో సెటైర్లు పేలుతున్నాయి.

    లైన్ క్లియర్

    లైన్ క్లియర్

    ఎన్నికల కారణంగా ఇంతకాలం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఏపీలో విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు ఆ హడావుడి ముగియడం, వైసీపీ అధికారంలోకి రావడంతో ఈ మూవీకి లైన్ క్లియర్ అయినట్లయింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించారు. దీన్ని వైసీపీ నేత రాకేష్ రెడ్డి నిర్మించిన నేపథ్యంలో ఏపీలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తారని స్పష్టమవుతోంది.

    లక్ష్మీస్ ఎన్టీఆర్

    లక్ష్మీస్ ఎన్టీఆర్

    లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటించారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, వెన్నుపోటు పర్వం ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రం తెరకెక్కించారు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించగా రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించారు.

    English summary
    "Lakshmi’s NTR effect on CBN defeat. May summer in AP has created many sun strokes but TDP got affected with only one son stroke." RGV tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X