twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు అర్జున్ ఫొటోతో ఆర్జీవీ కామెడీ.. నేను నచ్చలేదు అనుకున్నా!

    |

    అంతా ఆసక్తిగా ఎదురుచూసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆంధ్ర హైకోర్టు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై స్టే విధించిన సంగతి తెలిసిందే. అయినా కూడా చిత్రయూనిట్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని మార్చి 29న తెలంగాణలో యథావిధిగా విడుదల చేశారు. కోర్టు సమస్యలు తీరాక ఈ చిత్రం ఆంధ్రాలో కూడా విడుదల కానుంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆర్జీవీ సోషల్ మీడియాలో తనదైన శైలిలో ఈ చిత్రానికి ప్రచారం కల్పించుకుంటున్నాడు.

    <strong>బెస్ట్ కాంప్లిమెంట్: ఎన్టీఆర్ నిజమైన కుమారుడు రామ్ గోపాల్ వర్మ!</strong>బెస్ట్ కాంప్లిమెంట్: ఎన్టీఆర్ నిజమైన కుమారుడు రామ్ గోపాల్ వర్మ!

    పరిచయం లేని నటీనటులు

    పరిచయం లేని నటీనటులు

    పెద్దగా పరిచయం లేని నటీనటులతో ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్టీఆర్ పాత్రలో రంగస్థల నటుడిగా రాణిస్తున్న విజయ్ కుమార్ నటించారు. ఇక లక్ష్మి పార్వతి పాత్రలో యజ్ఞ శెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమకు నటించే అవకాశం రావడంపై ఈ ముగ్గురూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రకు తాను ఎలా ఎంపికయ్యాననే విషయాన్ని విజయ్ కుమార్ ఆసక్తికరంగా వివరించారు.

    నచ్చలేదు అనుకున్నా

    నచ్చలేదు అనుకున్నా

    40 ఏళ్ల నుంచి తనకు నాటక రంగంలో అనుభవం ఉందని విజయ్ కుమార్ అన్నారు. సినిమాల్లో పూర్తి స్థాయి పాత్రలో నటించడం ఇదే తొలిసారి. నా గురించి ఆర్జీవికి చాలా మంది చెప్పారు. నాకు రంగస్థల ఎన్టీఆర్ అనే పేరు కూడా ఉంది. దీనితో ఆర్జీవీ నాకు ఫోన్ చేసి డైలాగ్ చెప్పిన వీడియోని షూట్ చేసి పంపమని అడిగారు. అలాగే పంపించా. ఒక వారం వరకు రెస్పాన్స్ రాలేదు. నేను నచ్చలేదేమో అని అనుకున్నా. కానీ ఆ తర్వాత ఆర్జీవీ ఫోన్ చేసి హైదరాబాద్ కు రమ్మని అడిగారు. అలా ఈ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని విజయ్ కుమార్ తెలిపారు.

     రాజకీయాలతో సంబంధం లేదు

    రాజకీయాలతో సంబంధం లేదు

    ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్ర పోషించిన శ్రీతేజ మాట్లాడుతూ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎంతమేరకు వాస్తవం ఉందనేది పబ్లిక్ లో జరుగుతున్న చర్చ. అది రాజకీయ పరమైన అంశం. రాజకీయాలతో మాకు సంబంధం లేదు. దానిగురించి మాట్లాడడం సరైనది కాదు. నటుడిగా దర్శకుడి సూచనల మేరకు నటించా అని శ్రీ తేజ తెలిపాడు. చంద్రబాబు పాత్రలో శ్రీతేజ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి.

    బన్నీ ఫొటోతో కామెడీ

    ఇక ఆర్జీవీకి ఓ ఇష్యూతో ఎలా పబ్లిసిటీ పొందాలో బాగా తెలుసు. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో ఆర్జీవీ గురించి మీడియాలో హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో వర్మ సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారుతున్నాడు. తాజాగా రుద్రమదేవి చిత్రంలో అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి ఫోటోని మార్ఫింగ్ చేసి తన ముఖాన్ని పెట్టుకున్నాడు. దీనికి రామ్ బలి అనే క్యాప్షన్ కూడా పెట్టాడు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    English summary
    Lakshmi's NTR Fame Vijay Kumar about RGV. RGV posts funny photo in twitter
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X