twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి పిలిపించారు, చిరాకొచ్చింది.. ఏం జరిగిందో బయట పెట్టిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పాత్రధారి!

    |

    Recommended Video

    Lakshmi's NTR Hero P.Vijay Kumar Reveals Interesting Facts About His Career || Filmibeat Telugu

    'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో ఎన్టీ రామారావు పాత్ర పోషించిన పి. విజయ్ కుమార్ తన పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించారు. నాటక రంగం నుంచి వచ్చిన ఆయన ప్రేక్షకులకు తెరపై అచ్చం ఎన్టీ రామారావును చూసిన ఫీలింగ్ కలిగించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పి. విజయ్ కుమార్ మాట్లాడుతూ...పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. గతంలో తనను డైరెక్టర్ రాజమౌళి పిలిపించినట్లు తెలిపారు.

    'మాది పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు. నేను పుట్టి పెరిగింది ఇక్కడే అయినా వ్యాపార రీత్యా సెటిలైంది పోలవరం సమీపంలోని కొయ్యలగూడెంలో.. అందుకే నన్ను కొయ్యలగూడెం విజయ్ కుమార్ అని పిలుస్తుంటారు.' అని చెప్పుకొచ్చారు.

    ఇప్పటి వరకు 4500 నాటకాలు

    ఇప్పటి వరకు 4500 నాటకాలు

    కొయ్యలగూడెం వెళ్లిన తర్వాతే డ్రామా ఆర్టిస్ట్ అయ్యాను. ఆ ఊర్లో పెద్దపెద్ద వాళ్లంతా నాటకాలు ఆడేవారు. నాటక సమాజాలు ఉండేవి. సినిమా ఆర్టిస్ట్ అన్నపూర్ణ గారు కూడా అప్పట్లో నాటకాలు వేయడానికి అక్కడికి వచ్చేవారు. తన 45 ఏళ్ల కెరీర్లో ఇప్పటి వరకు 4500 నాటకాలు వేశాను. ఎక్కువగా పౌరాణిక నాటకాలే వేశాను. సంవత్సరానికి 150 నాటకాలు వేసిన రోజులు కూడా ఉన్నాయని తెలిపారు.

    ఈ పాత్ర చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు

    ఈ పాత్ర చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు

    ‘నాటక రంగం నా కెరీర్‌కు పునాది, అక్కడ చేశాను కాబట్టే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో రామారావుగారి క్యారెక్టర్ చేయగలిగాను. మూడు నెలల పాటు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' షూటింగ్ జరిగింది. ముంబైలోనే ఎక్కువ షూటింగ్ చేశారు, తర్వాత మైసూరు కొంత షూటింగ్ జరిగింది. ఊరేగింపులకు సంబంధించిన సీన్లు సిద్ధపేటలో చిత్రీకరించారు. రామారావుగారి పాత్రను చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు.' అని విజయ్ కుమార్ వెల్లడించారు.

    చాలా ప్రయత్నించాను, చిరాకొచ్చింది

    చాలా ప్రయత్నించాను, చిరాకొచ్చింది

    ఒకప్పుడు హైదరాబాద్‌లో సినిమా అవకాశాల కోసం చాలా ప్రయత్నించాను. ఫోటోలు ఇచ్చి ఇచ్చి చిరాకొచ్చింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల తర్వాత కొందరు ఫోటోలు పంపమని అడుగుతున్నారు. కానీ పంపడం లేదని విజయ్ కుమార్ వెల్లడించారు.

    ‘యమదొంగ'లో ఆ సీన్ నేనే చేశాను

    ‘యమదొంగ'లో ఆ సీన్ నేనే చేశాను

    ‘రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘యమదొంగ' సినిమాలో ఓ సీన్ కోసం నన్ను పిలిపించారు. హీరో చనిపోయి స్వర్గానికి వెళ్లినపుడు అక్కడ ఉన్న ఎన్టీఆర్ ‘మనవడా.. ఏంటి ఇలా వచ్చావ్' అనే సీన్ నేను చేసిందే. అయితే గ్రాఫిక్స్‌లో మార్చేసి చూపించారు. ఈ విషయం నేను ఇంత వరకు ఎక్కడా చెప్పుకోలేదు... ఇపుడు సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను.' అని విజయ్ కుమార్ చెప్పుకొచ్చారు.

    నా నీడ కోసం అయితే నన్నెందుకు పిలిపించారు? అని ప్రశ్నించాను

    నా నీడ కోసం అయితే నన్నెందుకు పిలిపించారు? అని ప్రశ్నించాను

    వాస్తవానికి నేను అక్కడికి వెళ్లే సరికే ఆల్రెడీ ల్యాప్ టాపులో యమదొంగలోని ఆ సీన్ ఉంది. ఆల్రెడీ ఉంది కదా నాతో ఎందుకు చేయిస్తున్నారని అడిగితే... అక్కడ ఒకాయన... కేవలం గ్రాఫిక్స్‌లో మార్చుకోవడానికి నీ నీడ అవసరమని చెప్పారు. ‘నా నీడ గురించి నన్నెందుకు పిలిపించారని' అని వారిని ప్రశ్నించినట్లు విజయ్ కుమార్ గుర్తు చేసుకున్నారు.

    రాజమౌళి ఆఫీసు నుంచి ఫోన్ వస్తే... నాటకాలు వదిలేసుకుని రాలేనని చెప్పా

    రాజమౌళి ఆఫీసు నుంచి ఫోన్ వస్తే... నాటకాలు వదిలేసుకుని రాలేనని చెప్పా

    ‘‘తర్వాత రాజమౌళి ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. అపుడు నేను శివరాత్రి నాటకాల్లో ఉన్నాను. నేను డ్రామా ఆర్టిస్టును, నాటకాన్ని వదిలేసుకుని సినిమా చేయడానికి రాను, కాబట్టి ముందుగా చెప్పండి, అప్పుడే రావడానికి వీలవుతుందని చెబితే... వారు ఈ రోజు ఫోన్ చేసి రేపు రావాలని అడిగారు. దాంతో రావడం కుదరదని చెప్పేశాను. అప్పటికే రెండు నాటకాలు అయ్యాయి, ఇంకా ఆరు నాటకాలు ఉన్నాయి. అందుకే నేను రాలేను'' అని చెప్పినట్లు విజయ్ కుమార్ అప్పటి విషయాలను రివైండ్ చేసుకున్నారు.

    English summary
    Lakshmi's NTR Hero P Vijay Kumar acted in Rajamouli's Yamadonga. He played Senior NTR role in heaven scene, But that scene changed in graphics.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X