‘లక్ష్మీస్ ఎన్టీఆర్’కు తెలంగాణలో లైన్ క్లియర్... ఏపీలో రిలీజ్ అవుతుందా?
Recommended Video

'లక్ష్మిస్ ఎన్టీఆర్' సినిమా విడుదలకు తెలంగాణలో లైన్ క్లియర్ అయింది. సినిమా విడుదల ఆపాలని వేసిన పిటిషన్ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కొట్టిపారేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
అయితే సినిమా ముందుగా ప్రకటించినట్లు మార్చి 22న కాకుండా... మార్చి 29న విడుదల చేయబోతున్నట్లు వర్మ తెలిపారు. ఈ మేరకు న్యూ రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్లను చిత్ర బృందం విడుదల చేసింది. కోర్టు తీర్పుతో సినిమా రావాలని కోరుకుంటున్న వారిలో ఆనందం నెలకొంది.

తెలంగాణలో లైన్ క్లియర్
‘లక్ష్మిస్ ఎన్టీఆర్' విడుదలైతే ఎన్నికల సమయంలో ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పిటిషన్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ... విడుదల ఆపడం కుదరదు, భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో మేము కలుగజేసుకోలేమని స్పష్టం చేసింది.

లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదల సమయంలో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటారు అని ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు. దీంతో తెలంగాణలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు లైన్ క్లియర్ అయినట్లయింది.

ఏపీలో విడుదలవుతుందా?
తెలంగాణలో ఈ వివాదాస్పద సినిమాకు లైన్ క్లియర్ అయింది కానీ... ఏపీలో పరిస్థితి ఏమిటి? అక్కడ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా? అనే విషయంలో మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. ఈ చిత్రం ఏపీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందనే ఆరోపణల నేపథ్యంలో రిలీజ్ విషయంలో ఉత్కంఠ నెలకొనిఉంది.
బాలయ్య స్పూప్ వీడియో వదిలిన వర్మ
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విషయంలో బాలయ్య స్పందించినట్లుగా రామ్ గోపాల్ వర్మ ఓ స్పూప్ వీడియో తయారు చేసి వదిలారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రావడం పక్కా...
కొన్ని సార్లు రావడం లేట్ అవ్వొచ్చు కానీ... రావడం మాత్రం పక్కా అంటూ పవన్ కళ్యాణ్ చెబుతున్నట్లు క్రియేట్ చేసిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











