»   »  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: నిప్పుకు ఆజ్యం పోస్తున్న వర్మ, ఆ మంటల్లో కాలిపోయేదెవరో..?

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: నిప్పుకు ఆజ్యం పోస్తున్న వర్మ, ఆ మంటల్లో కాలిపోయేదెవరో..?

Posted By:
Subscribe to Filmibeat Telugu
RGV Officially Announced His Upcoming Movie "Lakshmi's NTR"

రామ్ గోపాల్ వర్మ త్వరలో తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లకల్లోలం సృష్టించడం ఖాయమేనా? అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వర్మ ఎంచుకున్న సబ్జెక్ట్ అత్యంత వివాదాస్పదమైన అంశం.

ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి... నివురుగప్పిన నిప్పులా కొందరి గుండెల్లో మాత్రమే రగిలిపోతున్న అంశాలపై వర్మ తన సినిమా ద్వారా ఆజ్యం పోయబోతున్నారు.

వర్మ పోసే ఆజ్యంతో ఇన్నాళ్లు ఎన్టీఆర్ అభిమానులు తమ మనసులో దాచుకున్న అసంతృప్తి జ్వాలల ఆకలి తీరుస్తుందని, అవి భగ్గున మండి వాటి సెగ తాకాల్సిన వారికి తాకుతుందని అంటున్నారు.

పలమనేరులో ప్రకటన

పలమనేరులో ప్రకటన

ఇప్పటికే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేసిన వర్మ, తాజాగా మంగళవారం చిత్తూరు జిల్లా పలమనేరులో సినిమాను అధికారికంగా ప్రకటించారు. నిర్మాత రాకేష్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినిమాకు సంబంధించిన విశేషాలు తెలియజేశారు.

సంవత్సరంలోగా సినిమా రిలీజ్

సంవత్సరంలోగా సినిమా రిలీజ్

2018లో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రారంభిస్తున్నట్లు, మళ్లీ వచ్చే అక్టోబర్ నాటికి సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేస్తామని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

ఎన్టీఆర్ జీవితం మహాభారతం, నేను తీసేది ఆ పోర్షన్ మాత్రమే

ఎన్టీఆర్ జీవితం మహాభారతం, నేను తీసేది ఆ పోర్షన్ మాత్రమే

ఎన్టీఆర్ జీవితం మహాభారతం లాంటిదని, ఆయన జీవితంలో చాలా అధ్యాయాలు ఉన్నాయి. అందులో తాను ఒక అధ్యాయాన్ని తన సినిమా కోసం వాడుకుంటున్నట్లు తెలిపారు. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి సినిమా మొదలవుతుందని వర్మ స్పష్టం చేశారు.

నిర్మాత వైసీపీ నేత

నిర్మాత వైసీపీ నేత

‘లక్ష్మీస్' ఎన్టీఆర్ సినిమాను నిర్మించబోయేది వైసీపీ నేత రాకేష్ రెడ్డి. అయితే ఈ సినిమాలో ఎలాంటి రాజకీయ కోణం ఉండవని ఆయన స్పష్టం చేశారు. తనకు తెలిసిన ఎన్టీఆర్ జీవితాన్ని మాత్రమే చూపిస్తానన్నారు

త్వరలో నటీనటుల ప్రకటన

త్వరలో నటీనటుల ప్రకటన

త్వరలో ఈ సినిమాకు సంబంధించిన నటీనటులను ప్రకటిస్తామని వర్మ తెలిపారు. ఇందులో లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ పాత్రతో పాటు మరొకరి పాత్ర కీలకంగా ఉంటుందని వర్మ స్పష్టం చేశారు.

నీ అబ్బ సొత్తా?...... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఇష్యూపై ఆర్జీవీ ఘాటుగా రిప్లై!

నీ అబ్బ సొత్తా?...... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఇష్యూపై ఆర్జీవీ ఘాటుగా రిప్లై!

రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ జీవితంపై 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. నీ అబ్బ సొత్తా?...... ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఇష్యూపై ఆర్జీవీ ఘాటుగా రిప్లై ఇచ్చారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Film Maker Ram Gopal Varma and Producer Rakesh Reddy officially announced their upcoming movie "Lakshmi's NTR" in Palamaneru on Tuesday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu