Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ హైలెట్స్ ఇవే: సినిమాలో ఏం చూపించారంటే...
రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఏపీ హైకోర్ట్ స్టే కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం విడుదల ఆగిపోయింది. ప్రస్తుతం చిత్ర బృందం సుప్రీం కోర్టును ఆశ్రయించి ఏపీలో స్టే ఎత్తి వేయించేందుకు, సినిమా విడుదలకు మార్గం సుగమం చేయించే ప్రయత్నాల్లో ఉన్నారు.
కాగా.. ఈ సినిమాలో ఏం చూపిస్తారు? ఏలాంటి వివాదాస్పద అంశాలు ఉండబోతున్నాయనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వెన్నుపోటు అంశం, ఎన్టీఆర్ మీద ఆయన కుటుంబమే కుట్రలు చేసిందనే అంశాలు ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రం రూపొందించారు.
సినిమా ఫస్టాఫ్ ఎలా ఉందంటే...
సినిమా మొదటి భాగం మొత్తం లక్ష్మీ పార్వతి, ఎన్టీ రామారావు మధ్య వచ్చే సీన్లతోనే సాగింది. తొలి భాగం ఏమంత ఆకట్టుకునే విధంగా లేదని, స్క్రీన్ ప్లే కాస్త బోరింగ్‌గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
సెకండాఫ్‌లో ఏం చూపించారు
మూవీ సెకండాఫ్ వచ్చేసరికి వెన్నుపోటు ఎపిసోడ్ ప్రధానంగా చూపించారు. ఈ సీన్ల సీక్వెన్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచే విధంగా డిజైన్ చేశారు. సినిమా క్లైమాక్స్ ఎక్కువగా ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయం గురించి చర్చిస్తూ.. సెంటిమెంట్ డోసుతో నడిపించారు.
లక్ష్మీ పార్వతి గురించి ఎలా చూపించారంటే...
ఇక ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతిని చాలా మంచి వ్యక్తిగా చూపించే ప్రయత్నం చేశారు. ఆమె అసలు పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లోకానీ, గవర్నమెంటుకు సంబంధించి వ్యవహారాల్లో కానీ ఇన్వాల్వ్ కాలేదనే విధంగా చూపించారు. ఆమెపై వచ్చినవి అన్నీ కేవలం నిందలే అనే విధంగా ఫోకస్ చేశారు.
ఎన్టీఆర్ ఫ్యామిలీని ఎలా చూపించారు
ఎన్టీఆర్‌కు అన్యాయం జరుగడానికి ప్రధాన కారకులు ఆయన కుటుంబ సభ్యులే అనేది ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రం రూపొందించారు.రాజకీయాల పరంగా చూస్తే... ఈ చిత్రం కొందరికి నష్టం కలిగించే అవకాశం ఉంది.
నటీనటులు
ఎన్టీ రామారావు పాత్రలో కనిపించిన వ్యక్తి లుక్ పరంగా అంతగా ఇంపాక్ట్ చూపించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లక్ష్మి, బాబు పాత్రలు బాగా సెట్టయ్యాయి కానీ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పాత్రల్లో నటించిన వ్యక్తులు పెద్దగా ఆకట్టుకోదని టాక్.