ఏపీలో విడుదలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’... అప్పుడొస్తే 5 సీట్లే వచ్చేవంటున్న జనం!

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం(మే 31) విడుదలైంది. ఈ బయోపిక్‌కు ఏపీ ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఎన్టీ రామారావు చివరి రోజుల్లో అనుశించిన మానసిక క్షోభను ఈ చిత్రంలో రామ్ గోపాల్ వర్మ బాగా చూపించారని ప్రశంసించారు.

మరికొందరు అభిమానులు స్పందిస్తూ... ఈ సినిమా ఎన్నికల ముందు విడుదలై ఉంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీకి 23 సీట్లు కూడా వచ్చేవి కాదని, కేవలం 5 సీట్లు మాత్రమే వచ్చేవని.... పార్టీ ఓడిపోయే పరిస్థితి ఉందని తెలిసే అప్పుడు రిలీజ్ కాకుండా అడ్డుకున్నారని తెలిపారు.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం మార్చి 29న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే కోర్టులో వివాదం కారణంగా ఈ మూవీ రిలీజ్ ఆంధ్రప్రదేశ్‌లో నిలిచిపోయింది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఉందని, ఎన్నికల తర్వాతే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని కొందరు న్యాయస్థానాన్నిఆశ్రయించడంతో మూవీ విడుదల కాలేదు.

Lakshmi’s NTR Movie Public Talk in AP

ఎన్నికలు ముగిసిన తర్వాత సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. ఫలితాలు వెలువడటానికి ముందు విజయవాడ వెళ్లిన వర్మకు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. వర్మ పెట్టే ప్రెస్ మీట్ వల్ల స్థానికంగా శాంతి భద్రతల సమస్య ఏర్పడే అవకాశం ఉండటంతో అతడిని విజయవాడ రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చిత్రానికి మార్గం సుగమం అయింది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటించారు. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, వెన్నుపోటు పర్వం ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రం తెరకెక్కించారు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించగా రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X