For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్విట్టర్ రివ్యూ: షాకయ్యేలా ఎండింగ్, సీబీఎన్ సీన్లపై టాక్ ఎలా ఉందంటే..

  |
  Lakshmi's NTR Movie Twitter Review || లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్విట్టర్ రివ్యూ || Filmibeat Telugu

  ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అయితే స్థానిక హైకోర్టు స్టే కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈ చిత్రం విడుదల కాలేదు. యూఎస్ఏతో పాటు ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇప్పటికే ప్రీమియర్ షోలు పడ్డాయి.

  ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత జరిగిన పరిణామాలు, ఆయన్ను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి నుంచి పక్కకు తప్పించడమే కాదు, చివరకు ఆయన స్థాపించిన పార్టీ నుంచి కూడా బయటకు పంపిన వ్యక్తులు, సంఘటనలు, వాటి వెనక ఉన్న వాస్తవాలను ఫోకస్ చేస్తూ ఈ చిత్రం తెరకెక్కించారు.

  కాగా... ఓవర్సీస్ ఏరియాలైన యూఎస్ఏ, ఆస్ట్రేలియాతో పాటు హైదరాబాద్‌లో స్పోషల్ షో వీక్షించిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఆ విశేషాలపై ఓ లుక్కేద్దాం..

  హాట్సాఫ్ ఆర్జీవీ, అదరగొట్టారు

  హాట్సాఫ్ ఆర్జీవీ, అదరగొట్టారు

  లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో రామ్ గోపాల్ వర్మ... ఫ్యామిలీ బాండింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఒక పొలిటికల్ డ్రామాను సరికొత్త లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామాగా మలచడంలో సక్సెస్ అయ్యాడు. అతడి విజన్‌కు హాట్సాఫ్. ఆర్జీవీ మళ్లీ ఫాంలోకి వచ్చాడు.. అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశారు.

  ఇలాంటి సినిమా తీసిన మీ గట్స్‌ సూపర్

  ఇలాంటి సినిమా తీసిన మీ గట్స్‌ సూపర్

  ఇప్పుడే లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ చూశాను. రామ్ గోపాల్ వర్మ ఒక ఓల్డేజ్ లవ్ స్టోరీని న్యూఏజ్ లవ్ స్టోరీగా చూపించారు. ఇలాంటి సినిమా తీసిన మీ గట్స్‌ను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాం.

  ముగింపు షాకయ్యేలా ఉంటుంది

  ముగింపు షాకయ్యేలా ఉంటుంది

  లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ కేవలం ఎన్టీఆర్-లక్ష్మీ పార్వతి మధ్య ఉన్న ప్రేమ గురించి మాత్రమే కాదు... రామ్ గోపాల్ వర్మ ఎన్టీ రామారావును ఎంత లవ్ చేస్తున్నారో చెప్పే చిత్రం. ఇదొక మోస్ట్ ఇంటెన్స్ డ్రామా. యజ్ఞశెట్టి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. కళ్యాణిమాలిక్ తన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోరుతో సినిమాకు వెన్నుముఖలా నిలిచారు. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ ఇంక్రెడబుల్. సినిమా ముగింపు అందరూ షాకయ్యేలా ఉంటుంది

  కాంట్రవర్సల్ సీన్స్ ఔట్ స్టాండింగ్

  కాంట్రవర్సల్ సీన్స్ ఔట్ స్టాండింగ్

  హైదరాబాద్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ స్పెషల్ షో చూశాను. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, కాంట్రవర్సల్ సీన్స్ ఔట్ స్టాండింగ్ అనేలా ఉన్నాయి. ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. రామ్ గోపాల్ వర్మకు హాట్సాఫ్.

  ఫస్టాప్ బోరింగ్, సిబిఎన్ సీన్లు ఇంపాక్ట్ కలిగించలేదు

  ఫస్టాప్ బోరింగ్, సిబిఎన్ సీన్లు ఇంపాక్ట్ కలిగించలేదు

  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' ఫస్టాఫ్ చాలా బోరింగ్ అనేలా ఉంది. సిబిఎన్ సీన్లు పెద్దగా ఇంపాక్ట్ కలిగించలేదు. ఇదొక డిజాస్టర్ మూవీ, ప్లాప్ అయ్యేలా ఉంది. తెలుగుదేశం పార్టీని, సిబిఎన్‌ను వ్యతిరేకించే వారు కూడా ఈ సినిమాను చూడటం కష్టం. కొన్ని ఎమోషనల్ సీన్లు, చంద్రబాబుపై డైలాగులు బావున్నాయి. నా రేటింగ్ 1.5/5

  ఇంటర్వెల్ బ్యాంగ్ బావుంది

  ఇంటర్వెల్ బ్యాంగ్ బావుంది

  లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫస్టాఫ్ చాలా బావుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది.

  ఆ సీన్లు బావున్నాయి

  ఆ సీన్లు బావున్నాయి

  ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి మధ్య వచ్చే సన్నివేశాలు బావున్నాయి. సిబిఎన్‌ను బిగ్గెస్ట్ కన్నింగ్ యాక్టర్‌గా చూపించారు. సెకండాఫ్ కాస్త స్లోగా ఉంది.

  English summary
  Lakshmi's NTR movie twitter review by audience. Lakshmi's NTR is a biographical drama based on the life of former film actor and chief minister of undivided Andhra Pradesh, NT Rama Rao.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X