‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ప్రీ రిలీజ్ బిజినెస్ సూపర్.. లాభాలే లక్ష్యంగా వర్మ స్కెచ్!

Recommended Video

Lakshmi’s NTR Pre-Release Business Fetches Record Price.

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆర్జీవీ ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ మీద ఫోకస్ పెట్టారు . సినిమాను హిట్ చేయడం, లాభాలు చూపించడమే లక్ష్యంగా స్కెచ్ వేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'ఎన్టీఆర్ బయోపిక్' రెండు భాగాలు ఫెయిలైన నేపథ్యంలో.. పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు.

ఎన్టీ రామారావు జీవితంలోకి రెండో భార్యగా లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఈ చిత్రంలో ప్రధానంగా చూపించబోతున్నారు. ముఖ్యంగా ఈ పెళ్లి తర్వాత రామారావు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆయన జీవితంలో అత్యంత విషాదకరమైన వెన్నుపోటు పర్వం వెనక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు? ఆ సమయంలో ఆయన అనుభవించిన మనోవేధన ఇందులో ప్రధానంగా చూపించబోతున్నారు.

హైప్ క్రియేట్‌చేసిన వర్మ

హైప్ క్రియేట్‌చేసిన వర్మ

బాలయ్య నిర్మాతగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ‘ఎన్టీఆర్ బయోపిక్' బాక్సాఫీసు వద్ద దారుణ పరాజయం పాలైన నేపథ్యంలో పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకున్నారు రామ్ గోపాల్ వర్మ. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.

ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 9 కోట్లు

ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 9 కోట్లు

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్'పై మంచి హైప్ రావడంతో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం రూ. 9 కోట్లకు రైట్స్ అమ్మినట్లు సమాచారం. అయితే సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఇంకా ఫైనల్ కాలేదు.

శాటిలైట్ రైట్స్ రూ. 3 కోట్లు

శాటిలైట్ రైట్స్ రూ. 3 కోట్లు

మరో వైపు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాతలకు శాటిలైట్ రైట్స్ రూపంలో మరో 3 కోట్లు అదనంగా వచ్చినట్లు సమాచారం. దీంతో నిర్మాతలకు ఈ సినిమా ద్వారా రూ. 12 కోట్ల రాబడి వచ్చింది. సినిమా నిర్మాణం కోసం దాదాపు రూ. 5 కోట్లు లోపే ఖర్చుపెట్టినట్లు టాక్.

లక్ష్మీస్ ఎన్టీఆర్

లక్ష్మీస్ ఎన్టీఆర్

రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మిస్తున్నారు. రామారావు చివరి రోజుల్లో చోటు చేసుకున్న వివాదాస్పద అంశాలను ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఈ చిత్రం ఉంటుంది. ఎన్టీ రామారావు పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X