ఎన్టీఆర్ జీవితంలో చించేసిన పేజీలను అతికిస్తా: చంద్రబాబుకు వర్మ కౌంటర్

చంద్రబాబు కామెంట్లకు వర్మ స్పందించారు. చంద్రబాబు గారన్నట్టు ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమే అని తెలిపారు. కాని లక్ష్మి’స్ ఎన్టీఆర్ సినిమాలో నేను ఆ పుస్తకం లోని చిరిగిపోయిన లేదా చింపబడ్డ చాలా పేజీలని

By Bojja Kumar

Recommended Video

Ram Gopal Varma to make Sr. NTR biopic

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించబోతున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై ఇప్పటి వరకు టీడీపీ నేతలు మాత్రమే కామెంట్లు చేస్తూ వచ్చారు. ఈ చిత్రం టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటుందనే బలమైన వాదన ఉండటమే ఇందుకు కారణం.

ఈ సినిమా విషయంలో ఇప్పటి వరకు మౌనంగా ఉంటూ వచ్చిన చంద్రబాబు నాయుడు తొలిసారిగా స్పందించారు. లక్ష్మి'స్ ఎన్టీఆర్‌లో నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు, ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకం అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు కామెంట్లకు వర్మ వెంటనే సమాధానం ఇచ్చారు.

బాబుగారూ... మీ మాట నిజమే అన్న ఆర్జీవీ

బాబుగారూ... మీ మాట నిజమే అన్న ఆర్జీవీ

లక్ష్మి'స్ ఎన్టీఆర్ లో నిజాలను వక్రీకరిస్తే ప్రజలు హర్షించరు అన్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి మాటలు ముమ్మాటికీ నిజం ..అందుకనే నేను నిజంగా జరిగిన నిజాలనే ఏ మాత్రం వక్రీకరించకుండా తియ్యబోతున్నాను... అంటూ వర్మ కౌంటర్ ఇచ్చారు.

చింపేసిన పేజీలను అతికిస్తాను

చింపేసిన పేజీలను అతికిస్తాను

చంద్రబాబు గారన్నట్టు ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమే..కాని లక్ష్మి'స్ ఎన్టీఆర్ సినిమాలో నేను ఆ పుస్తకం లోని చిరిగిపోయిన లేదా చింపబడ్డ చాలా పేజీలని తిరిగి అతికించబోతున్నాను... అంటూ వర్మ తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు.

రాజమౌళి పొట్ట కొట్టేట్టు ఉన్నారే, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్.... జోకులేస్తూ ఘాటుగా వర్మ కౌంటర్!

రాజమౌళి పొట్ట కొట్టేట్టు ఉన్నారే, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్.... జోకులేస్తూ ఘాటుగా వర్మ కౌంటర్!

రాజమౌళి పొట్ట కొట్టేట్టు ఉన్నారే, ఇంతకన్న సైకో కామెంట్ బహుశా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పేషెంట్లు కూడా ఇఛ్చి వుండరు అంటూ .... టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ఉద్దేశించి జోకులేస్తూ ఘాటుగా వర్మ కౌంటర్ ఇచ్చారు.

లక్ష్మీ’స్ ఎన్టీఆర్.... ఆ ఫోటోస్ పోస్టు చేసి టెన్షన్ పెడుతున్న వర్మ

లక్ష్మీ’స్ ఎన్టీఆర్.... ఆ ఫోటోస్ పోస్టు చేసి టెన్షన్ పెడుతున్న వర్మ

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి వర్మ పోస్టు చేస్తున్న కొన్ని ఫోటోలు టీడీపీ పార్టీ వర్గాలను టెన్షన్ పెడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X