వర్మ కొత్త లెక్కలు.. 2+2 +1+1+1+2 = 9.. అంకెల గారడీ వెనుక అసలు కథ ఏంటంటే!

సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ చిత్రాన్ని మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో రాంగోపాల్ వర్మ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. సినిమాకు సంబంధించిన డేట్లు, ఏపీ ఎన్నికల తేదీని కలిపి ఓ కొత్త సమీకరణాన్ని తయారు చేశాడు. అదేమింటంటే..

వర్మ లేటెస్ట్ ట్వీట్

వర్మ లేటెస్ట్ ట్వీట్

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను మార్చి 22న రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏప్రిల్ 11వ తేదీన ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. మా సినిమా షో ముహుర్తాన్ని 12 గంటలకు ఫిక్స్ చేశాం అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

అంకెల గారడీతో వర్మ

తాను తెలిపిన మార్చి 22, ఏప్రిల్ 11, షో టైమ్ 12 అంకెలకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. స్వర్గీయ ఎన్టీఆర్ లక్కీ నంబర్ 9కి ఇవి సంకేతం. ఈ అంకెలను కూడితే 9 సంఖ్య వస్తున్నది (2+2 +1+1+1+2 = 9) అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

 ఎన్టీఆర్ ఫ్యామిలీ టార్గెట్‌గా

ఎన్టీఆర్ ఫ్యామిలీ టార్గెట్‌గా

స్వర్గీయ ఎన్టీఆర్ ఫ్యామిలీ సభ్యులను వర్మ టార్గెట్‌గా చేసుకొని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రూపొందించినట్టు ట్రైలర్లు, టీజర్లలో స్పష్టంగా కనిపించాయి. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించిన తర్వాత టీడీపీలో చోటుచేసుకొన్న కీలక అంశాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు ఇటీవల వర్మ వెల్లడించారు.

బాలయ్య వల్లే లక్ష్మీస్ ఎన్టీఆర్

బాలయ్య వల్లే లక్ష్మీస్ ఎన్టీఆర్

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు దర్శకత్వం వహించే క్రమంలో నందమూరి బాలకృష్ణకు తనకు జరిగిన చర్చల సందర్భంగా కొన్ని విభేదాలు తలెత్తాయి. ఆయనతో విభేదించడమే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు అంకురార్పణ జరిగింది. ఆయనను కలవకపోతే నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రూపొందించే వాడిని కాదు అని వర్మ తెలిపారు. ఎన్టీఆర్ ఔనత్యాన్ని కించపరచలేదని ఆయన పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X