twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రేకింగ్: ఆర్జీవికి ఝలక్.. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల ఆపేసిన ఆంధ్ర హైకోర్టు!

    |

    Recommended Video

    Andhra Pradesh High Court Says No For Lakshmi’s NTR Release | Telugu Filmibeat

    దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర విడుదల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర విడుదల విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మార్చ్ 22న విడుదుల కావాల్సింది. కానీ 29కి వాయిదా పడింది. ఎలాగైనా ఈ చిత్రాన్ని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నించింది. ఎన్నికల సంఘం కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి అడ్డు చెప్పలేదు. దీనితో మార్చి 29న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదల ఖాయం అనుకుంటున్న సమయంలో దర్శకుడు అర్జీవికి పెద్ద ఝలక్. ఈ చిత్ర విడుదలని ఆపేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులు జరీ చేసింది.

    ఆర్జీవికి షాక్

    ఆర్జీవికి షాక్

    ఎన్టీఆర్ జీవితంలోని అత్యంత వివాదాస్పద అంశాలతో రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని నెగిటివ్ షేడ్స్ లో చూపిస్తుండడంతో టిడిపి నేతలు లక్ష్మిస్ ఎన్టీఆర్ చిత్ర విడుదల అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించాయి. కనీసం ఎన్నికలు ముగిసేవరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని వాయిదా వేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంగళగిరిలో టీడీపీ నేతలు ఫిటిషన్ దాఖలు చేశారు.

    రాజకీయ ఉద్దేశంతోనే

    రాజకీయ ఉద్దేశంతోనే

    ఈ పిటిషన్ నేడు న్యాయస్థానం ముందు విచారణకు వచ్చింది. టిడిపి తరుపున న్యాయవాది బలంగా తన వాదనని వినిపించారు. రాంగోపాల్ వర్మ రాజకీయ ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, ఈ చిత్రం ప్రభావం ఎన్నికలపై ఉంటుందని ఆయనే సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారని టిడిపి తరుపున న్యాయవాది వాదించారు. ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలతో సినిమా తీసి ఎన్నికల ముందే విడుదల చేయడంలో ఆంతర్యం ఏమిటని న్యాయవాది ప్రశ్నించారు.

    అప్పటి వరకు విడుదల వాయిదా

    అప్పటి వరకు విడుదల వాయిదా

    లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందనే వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. దీనితో ఏప్రిల్ 15, 2019 వరకు ఈ చిత్రాన్ని సినిమా థియేటర్స్, సోషల్ మీడియా, యూట్యూబ్ తదితర మాధ్యమాలలో ప్రదర్శించకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన కోర్టు ఆర్డర్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

    అంతా సిద్దమైన తరుణంలో

    అంతా సిద్దమైన తరుణంలో

    లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదలని కోర్టు వాయిదా వేయడం చిత్ర యూనిట్ కు పెద్ద షాక్ అని చెప్పొచ్చు. సెన్సార్ తో పాటు విడుదలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయిన తరుణంలో న్యాయస్థానం విడుదల అడ్డుకుంది. అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే శుక్రవారం రోజు ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఏప్రిల్ 15 వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం వాయిదా పడడంపై చిత్ర యూనిట్ ఇంకా స్పందించలేదు.

    English summary
    Lakshmi's NTR release delayed again, Court stalls RGV's film till AP elections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X