ఎన్టీ రామారావు వర్దంతిని లక్ష్యంగా చేసుకున్న రామ్ గోపాల్ వర్మ, నేటి సాయంత్రమే...

'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో సంచలనాలు క్రియేట్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ నేడు(జనవరి 18)న మరో సంచలనానికి శ్రీకారం చెట్టారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తూ... ఎన్టీఆర్ వర్దంతి రోజున లక్ష్మీస్ ఎన్టీఆర్ జీవంతో వస్తున్నారు అంటూ ట్వీట్ చేశారు. సాయంత్ర 5 గంటలకు ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.

వర్మ చేసిన ట్వీట్ చూస్తుంటే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీలో రామారావు పాత్ర పోషించేది ఎవరు? ఆయన లుక్ ఎలా ఉండబోతోంది అనేది నేటి సాయంత్రం రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే వెన్ను పోటు, ఎందుకు? పాటలతో సినిమాపై హైప్ పెంచిన వర్మ.... తాజా ట్వీటుతో మూవీపై ఉన్న క్రేజ్‌ను పీక్స్‌కు తీసుకుళ్లారు.

ఎన్టీఆర్ జీవితంలోకి రెండవ భార్యగా లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత జరిగిన పరిణామాలు, ఆయన్ను వెన్నుపోటు పొడిచింది ఎవరు? అనే అంశాలు ఈ చిత్రంలో చూపింబోతున్నట్లు చెబుతూ వస్తున్న ఆర్జీవీ ఇందులో లక్ష్మీ పార్వతి పాత్ర పోషిస్తున్న కన్నడ నటి యజ్ఞ శెట్టి లుక్ ఇటీవల విడుదల చేశారు.

Lakshmi’s NTR will come alive on the death anniversary of NTR: RGV

యజ్ఞ శెట్టి గతంలో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'వీరప్పన్' మూవీలో గంధపుచెక్కల స్మగ్లర్ భార్య పాత్రలో నటించారు. ఆవిడనే ఇపుడు తన తాజా చిత్రంలో ఎన్టీఆర్ భార్య లక్ష్మిపార్వతిగా చూపించబోతున్నారు. ఇందులో చంద్రబాబు పాత్ర పోషించే నటుడి లుక్ కూడా వర్మ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X