twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్‌పై కోపం, ఆ ఉద్దేశంతో కాదు.. రాజమౌళి సంపాదనపై కీరవాణి సోదరుడి కామెంట్స్!

    |

    కీరవాణి సోదరుడు, సంగీత దర్శకుడు అయిన కళ్యాణ్ మాలిక్ పేరు చెప్పగానే అలామొదలైంది, ఊహలు గుసగుసలాడే, ఆంధ్రుడు, ఐతే లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. చాలా చిత్రాలకు కళ్యాణ్ మాలిక్ మంచి సంగీతం అందించారు. కానీ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదగలేకపోయారు. ప్రస్తుతం కళ్యాణ్ మాలిక్ వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ కు సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ మాలిక్ తన సోదరుడు కీరవాణితో అనుబంధం, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విశేషాలు వివరించారు.

     టర్నింగ్ పాయింట్ అవుతుంది

    టర్నింగ్ పాయింట్ అవుతుంది

    లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం నా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తున్నట్లు కళ్యాణ్ మాలిక్ తెలిపారు. నా జీవితంలో రాంగోపాల్ వర్మని ఎప్పుడూ కలవలేదు. ఈ చిత్రంలో నాకు అవకాశం ఎలా వచ్చిందో కూడా అర్థం కావడం లేదు. ఓ రచయిత ఆర్జీవీ వద్ద నాపేరు ప్రస్తావించారు. ఊహలు గుసగుసలాడే చిత్రంలో ' ఏం సందేహం లేదు' అనే పాటని వినిపించారట. వెంటనే ఆర్జీవీ నన్ను ఎంపిక చేశారు. ఆయనే స్వయంగా ఫోన్ చేసి అడగడంతో నమ్మలేకపోయా అని కళ్యాణ్ మాలిక్ తెలిపారు.

    ఎన్టీఆర్ బయోపిక్‌కి అన్నయ్య

    ఎన్టీఆర్ బయోపిక్‌కి అన్నయ్య

    అన్నయ్య కీరవాణి ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నారు. ఆ చిత్రంపై కోపంతో అయన తమ్ముడిని అయిన నన్ను ఎంపిక చేసుకోలేదు. నా పనితనం గురించి తెలుసుకోవడం వలనే ఆర్జీవీ నన్ను ఎంపిక చేసుకున్నారని కళ్యాణ్ మాలిక్ తెలిపారు. నేను, అన్నయ్య కలుసుకునప్పుడు కూడా ఏ విషయం గురించి మాట్లాడుకోలేదు. సాధ్యమైనంత వరకు సినిమా విషయాలు మాట్లాడుకోము. కానీ ఎవరు ఏ చిత్రం చేస్తున్నారో తెలుస్తూ ఉంటుంది అని తెలిపారు.

    ఎన్టీఆర్ రాసిన కవిత

    ఎన్టీఆర్ రాసిన కవిత

    ఈ చిత్రంలో స్వయంగా ఎన్టీఆర్ రాసిన ఓ కవితని పాటగా కంపోజ్ చేసినట్లు కళ్యాణ్ మాలిక్ తెలిపారు. ఆ కవితని ఆర్జీవికి లక్ష్మి పార్వతి గారు ఇచ్చారని అన్నారు. ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని చాలా సీరియస్ గానే డీల్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో మొత్తం 8 పాటలు ఉన్నాయి. అన్ని పాటలు చాలా బాగా వచ్చాయి అని తెలిపారు.

    అర్జీవిపై వెకిలి కామెంట్స్

    అర్జీవిపై వెకిలి కామెంట్స్

    సోషల్ మీడియాలో ఆర్జీవీ గురించి చాలా మంది వెకిలి కామెంట్స్ చేస్తుంటారు. వాటన్నింటిని చూసినప్పుడు భాదగా అనిపిస్తుంది. ఆర్జీవీ ముసుగు లేని మనిషి. బొగ్గు నుంచే డైమండ్ వస్తుంది. కానీ ఆర్జీవీలో అందరూ బొగ్గునే చూస్తారు కానీ వజ్రాన్ని చూడరని అన్నారు. వాస్తవానికి తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి గాను రెమ్యునరేషన్ కూడా అడగలేదని కళ్యాణ్ మాలిక్ తెలిపారు. వర్మతో సినిమా చేయడం అంటేనే 10 కోట్ల రెమ్యునరేషన్ అంత విలువ అని తెలిపారు.

     అన్నయ్య, రాజమౌళి సంపాదన

    అన్నయ్య, రాజమౌళి సంపాదన

    అన్నయ్య కీరవాణి, రాజమౌళి చాలా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. వాళ్ళు నా కన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు, నేను వెనుకబడిపోయాను అనే ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు అని తెలిపారు. నా సతీమణి ఉమకి కూడా అలాంటి ఫీలింగ్ లేదు. కాకపోతే నేను కూడా బిజీగా ఉంటూ సక్సెస్ కావాలని కోరుకుంటుంది. అన్నయ్య రాజమౌళి కూడా డబ్బు ఎక్కువ సంపాదిస్తున్నాం కాదనే అనే భావనతో మెలగరని కళ్యాణ్ మాలిక్ అన్నారు.

    English summary
    Lakshmis NTR music director Kalyan malik interesting comments on RGV and Rajamouli
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X