‘లైఫ్ ఆఫ్ పై’ చిత్రంపై చిరంజీవి కన్ను!
అసలు వివరాల్లోకి వెళితే...
గత సంవత్సరం నవంబర్లో వచ్చిన 'లైఫ్ ఆఫ్ పై' చిత్రంలో భారత దేశంలోని కొన్ని ప్రదేశాలను బహు అద్భుతంగా చూపించారు. యాన్ మార్టేల్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్, సూరజ్ శర్మ మరియు టబు ప్రధాన పాత్రలు పోషించారు. ఒక షిప్ అకస్మాత్తుగా ప్రమాదానికి గురై మునిగిపోగా అందులోంచి ఓ చిన్న పడవలో బయటపడ్డ కుర్రాడు, అతనికి తెలియకుండా అతని పడవలో ఉన్న ఒక బెంగాల్ టైగర్, జీబ్రా, హైనా, ఒక ఓరంగ్ ఉతన్ ఆ నది సముద్రం నుండి వారి ప్రయాణం ఎలా సాగింది అనేది కథాంశం. ఈ సినిమా కథ ఎక్కువగా ఇండియాకి సంబంధం ఉంటుంది ముఖ్యంగా పాండిచ్చేరికి.
సినిమాలో ముఖ్యంగా పుదుచ్చేరి, మన్నార్ ప్రాంతాల ప్రకృతి సౌందర్యాన్ని చాలా బాగా చూపించాడు దర్శకుడు. దీంతో ఈ సినిమాను.... కేంద్ర పర్యాటక శాఖ ప్రచారానికి వాడుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉంది మన తెలుగు మెగాస్టార్ చిరంజీవి కావడంతో ఆయన సినిమాటిక్ గా ఆలోచించి... ఈ సినిమాలో చూపించిన ప్రదేశాలకు భారతీయ పర్యాటక కేంద్రాలుగా మరింత ప్రచారం కల్పించి భారత టూరిజాన్ని అభివృద్ధి చేసేందకు ప్లాన్ చేస్తున్నారు.
త్వరలో 'ల్యాండ్ ఆఫ్ పై' పేరుతో వివిధ దేశాల్లో కాంపెయిన్ ప్రారంభించి.... విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. అదే విధంగా భారత్ లో హాలీవుడ్ సినిమాల షూటింగులు జరిగేలా ప్రోత్సహించి పర్యాటక శాఖ ఆదాయం పెరిగేలా మాస్టర్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. మరి చిరంజీవి ప్లాన్ ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications












