కడుపుతో ఉన్న ఆ ఇద్దరు హీరోయిన్లు సెలవులో...
బాలీవుడ్ హీరోయిన్లు లారా దత్త, సెలీనా జైట్లీలు ఇప్పడు సెలవులో ఉన్నారు. ఈ ఇద్దరు ఇప్పడు ప్రెగ్నంట్ కావడంతో మెటర్నటీ లీవ్ తీసుకుని సినిమాలకు, అన్ని ప్రొఫెషనల్ పనులకు టాటా చెప్పారు. మరికొన్ని నెలల పాటు ఈ ఇద్దరు బాలీవుడ్ తెరపై కనిపించే అవకాశం అస్సలు లేనే లేదు. పీటర్‌హాగ్ అనే ఆస్ట్రేలియా వ్యాపారిని సెలీనా ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ నిమిత్తం ఆవిడ ఆస్ట్రేలియాలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఇండియన్ టెన్సిస్ స్టార్ మహేష్ భూపతిని పెళ్లాడిన లారా దత్తా కూడా బాలీవుడ్ సర్కిల్ లో గత కొంత కాలంగా కనిపించక పోవడానికి కారణం కూడా ఇదే.
ఏది ఏమైనా బాలీవుడ్ స్టార్స్ అంతా ఒకరి తర్వాత ఒకరు వరుస పెట్టి అమ్మానాన్నలు అవుతుండటంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఐశ్వర్య-అభిషేక్ దంపతులు ఓ బిడ్డకు జన్మినిచ్చిన కొన్ని రోజులకే, మరో స్టార్ కపుల్ అమీర్ ఖాన్-కిరణ్ రావు తల్లిదండ్రులు కావడం, ఇపుడు ఇదే క్యూలో సెలీనా జైట్లీ, లారా దత్తలు ఉండటం విశేషం.


Click it and Unblock the Notifications











