పాపాయికి జన్మనిచ్చిన లారా -మహేష్
బాలీవుడ్ స్టార్ లారా దత్త- టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతి గత కొన్ని రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకోవడం, లారా దత్తా గర్భం దాల్చడం తెలిసిందే. తాజాగా లారా ఈ రోజు(జనవరి 20) ప్రసవించింది. ఆడ పిల్లకు జన్మనిచ్చింది. మహేష్ భూపతి ఈ తీపి కబురును ట్విట్టర్ ద్వారా అభిమానులకు వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. "ITS A GIRL!!!!!!!!!!!!!!!!!! @DuttaLara. I Love u...." అంటూ ట్వీట్ మహేష్ చేశాడు. కూతురు పుట్టడంపై మహేష్ ఆనందం వ్యక్తం చేశాడు. పట్టలేని ఆనందంతో తన స్నేహితులతో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు.
మాజీ విశ్వసుందరి అయిన ఐశ్వర్యరాయ్‌కి ఆడపిల్లే పుట్టడం....తాజాగా మరో మాజీ సుందరి లారా కూడా ఆడ పిల్లకి జన్మనివ్వడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. ఇప్పటి వరకు ఐశ్వర్య-లారా మధ్య పోటీ వాతావరణం ఉంటే...ఇప్పుడు వాళ్లకు జన్మించిన బుల్లి అందాల రాశుల మధ్య కూడా అదే తరహా వాతావరణం ఏర్పడబోతోందని కొందరు చమత్కరిస్తున్నారు.
అయితే ఐశ్వర్య కూతురు మాదిరి లారా కూతుర్ని కూడా మీడియా కంట పడకుండా పెంచుతారా? లేక ఆమె ఫోటోలు మీడియాకు విడుదల చేస్తారా? అనే విషయమై కూడా ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications












