సాహో తన సినిమాకు కాపీ అన్న డైరెక్టర్.. ఆ పనైనా మంచిగా చేయడంటూ తెలుగు దర్శకులపై సెటైర్లు

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ - సుజిత్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'సాహో'. నాలుగు రోజుల కిందట విడుదలైన ఈ సినిమా ప్రీమియర్ షోల సమయంలో మంచి టాక్ వచ్చింది. ఆ తర్వాత విడుదలైన రోజు రెండో ఆట నుంచి టాక్ మారిపోయింది. ఈ సినిమాను కొందరు బాగుందని అంటుండగా, మరికొందరు మాత్రం బాలేదని అంటున్నారు. దీంతో మిశ్రమ స్పందనకే ఈ చిత్రం పరిమితమైంది. అయినప్పటికీ సాహో కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు భాషల్లోనూ అత్యధిక కలెక్షన్లతో సత్తా చాటుతోంది. తాజాగా ఈ సినిమాపై ఓ దర్శకుడు ఫైర్ అయ్యాడు. ఇంతకీ ఎవరా దర్శకుడు.? ఎందుకు ఫైర్ అవుతున్నాడు.?

రెండు రోజులకే డబుల్ సెంచరీ

రెండు రోజులకే డబుల్ సెంచరీ

మొదటి రోజు వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ తో కలిసి రూ.130 కోట్ల గ్రాస్ వసూలు చేయగా రెండో రోజు కూడా అదే రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రభాస్ క్రేజ్ తో ఈ సినిమా రెండ్రోజుల్లోనే రూ.200 కోట్ల మార్కును అధిగమించింది. ఈ విషయాన్నీ ‘సాహో' నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అధికారికంగా వెల్లడించింది. రెండు రోజుల్లో తమ చిత్రం వరల్డ్ వైడ్ రూ.205 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిందని యూవీ క్రియేషన్స్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

 బాలీవుడ్‌ టార్గెట్ చేసింది

బాలీవుడ్‌ టార్గెట్ చేసింది

సాహో హిందీలో కూడా విడుదలైన విషయం తెలిసిందే. అక్కడ ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమాపై నెగెటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. వాస్తవానికి అంతకు ముందు నుంచే ఈ సినిమాపై బాలీవుడ్ ఫిల్మ్ మేకర్లు పీకల్లోతు కోపంతో ఉన్నారు. ఈ సినిమాను ఆడకుండా చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. తెలుగు సినిమా ఖ్యాతి దేశ వ్యాప్తం కావడం వాళ్లకు నచ్చకపోవడంతోనే ఇలా చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

తన సినిమా కాపీ కొట్టారంటున్న డైరెక్టర్

ఫ్రాన్స్‌కు చెందిన ఓ డైరెక్టర్ తన సినిమాను కాపీ కొట్టారంటూ సాహో యూనిట్‌పై విమర్శలు చేస్తున్నాడు. ఇంతకీ ఆయనెవరనే కదా మీ సందేహం..? అది మరెవరో కాదు.. గతంలోనూ పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాత‌వాసి సినిమాపై కాపీ రూమర్లు గట్టిగా వినిపించిన ‘లార్గోవించ్' డైరెక్టర్ జెరోమీ సాలే. అవును.. సాహోను తన సినిమా నుంచి కాపీ కొట్టారని ట్విట్టర్ వేదికగా ఆయన ఆరోపించాడు. అంతేకాదు, ఈ సినిమా చెత్తగా ఉందంటూ కామెంట్ చేశాడు.

తెలుగు వ్యక్తి ట్వీట్ చేయడంతో మొదలు

సాహో విడుదలైన రోజు ఓ నెటిజన్ ‘బడ్డీ.. ఇండియాలో మీ లార్గోవించ్ నుంచి మరో ఫ్రీమేక్ వచ్చేసింది. మీరు రియల్ గురూజీ' అని డైరెక్టర్ జెరోమీ సాలేకు ట్వీట్ చేశాడు. ఇది చూసిన అతడు వెంటనే ‘నాకు భారతదేశంలో మంచి మార్కెట్ ఉంది' అంటూ రిప్లై ఇచ్చాడు. ఆ తర్వాత సదరు దర్శకుడు సాహో సినిమాను చూశాడట. ఆ తర్వాతనే తన సినిమాను కాపీ కొట్టారంటూ అతడు ఆరోపణలు చేస్తున్నాడని తెలిసింది.

తెలుగు డైరెక్టర్లపై సెటైర్లు

తెలుగు డైరెక్టర్లపై సెటైర్లు

సాహోపైన ఆరోపణలు చేయడం మాత్రమే కాదు డైరెక్టర్ జెరోమీ సాలే తెలుగు సినీ ఇండస్ట్రీలోని అందరూ దర్శకులను విమర్శిస్తూ ట్వీట్ చేశాడు. ‘ప్రియ‌మైన తెలుగు ద‌ర్శ‌కులారా.. నా సినిమాను కాపీ కొడితే కొట్టారు కానీ.. ఆ ప‌నైనా స‌రిగా చేయండి' అని సెటైర్ విసిరాడు. అంతేకాదు, ‘నాకు ఇండియాలో మంచి మార్కెట్ ఉన్న‌ట్లుందే అంటూ ఇంత‌కుముందు చేసిన ట్వీట్ బాధ‌తో చేసిందే కానీ.. ఆ విష‌యంలో నేనేమీ చేయ‌లేను' అంటూ వివరణ ఇచ్చాడు.

అంతకు ముందు పవన్ సినిమాపై

అంతకు ముందు పవన్ సినిమాపై

డైరెక్టర్ జెరోమీ సాలే గతంలో పవన్ కల్యాన్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన అజ్ఞాత‌వాసి సినిమాపై కాపీ ఆరోపణలు చేశాడు. అయితే, అప్పుడు సినిమా చూడకుండానే ఆరోపించాడు. ఆ సమయంలో ‘అజ్ఞాత‌వాసి టికెట్ కొనాలని అనుకుంటున్నాను..క్యూరియస్‌గా ఉన్నాను' అని ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది.

సాహో గురించి

సాహో గురించి

తెలుగు సినీ చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందిన సినిమాల్లో ‘సాహో' ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ‘రన్ రాజా రన్' ఫేం సుజిత్ తెరకెక్కించాడు. యూవీ క్రియేషన్స్ నిర్మించిన సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించింది. ఈ సినిమా ఆగస్టు 30న నాలుగు భాషల్లో విడుదల అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X