3 నెలలు కష్ట పడ్డా, న్యూ లుక్‌పై మహేష్ బాబు ట్వీట్
ఈ విషయమై మహేష్ బాబు తన ట్విట్టర్లో ప్రస్తావించారు. 'గడిచిన మూడు నెలలు చాలా కష్ట పడ్డాను. వరల్డ్ బెస్ట్ ట్రైనర్ క్రిస్ గెతిన్ పర్యవేక్షణలో న్యూలుక్ కోసం ట్రైనింగ్ తీసుకున్నాను. నా కొత్త లుక్ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది' అంటూ మహేష్ బాబు ట్విట్ చేసారు.
ప్రస్తుతం సినిమా షూటింగులో బిజీగా గడుపుతున్నానని, రాబోయే 10 రోజులు నైట్ షూటింగ్ ఉందని, ఈ నెల 11న నంది అవార్డు ఫంక్షన్‌కు హాజరవుతానని, దూకుడు సినిమాకు వచ్చిన నంది అవార్డును స్వీకరిస్తానని మహేష్ బాబు వెల్లడించారు. అదే విధంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు మహేష్.
మహేష్-సుకుమార్ సినిమా వివరాల్లోకి వెళితే... క్రితి సానన్ హీరోయిన్. మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. త్వరలో ఈచిత్రానికి టైటిల్ ఖరారు కానుంది. ఈ చిత్రంలో షాయాజీ షిండే, కిల్లి దోర్జీ, విక్రమ్ సింగ్, శ్రీనివాస్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానినికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: ఆర్ రత్నవేలు, స్టూడియో: 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సుకుమార్.


Click it and Unblock the Notifications












