»   » బిగ్ బాస్... ఇంట్లో చివరి రోజు విశేషాలు, ఎన్టీఆర్, ముమైత్ డుమ్మా!

బిగ్ బాస్... ఇంట్లో చివరి రోజు విశేషాలు, ఎన్టీఆర్, ముమైత్ డుమ్మా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు బుల్లితెరపై సూపర్ సక్సెస్ అయిన రియాల్టీ షో 'బిగ్ బాస్' నేటితో ముగియనుంది. ఫైనల్ వరకు చేరిన ఐదుగురు సభ్యుల్లో విజేత ఎవరు? అనేది ఆదివారం సాయంత్రం తేలనుంది. కాగా. బిగ్ బాస్ ఇంట్లో చివరి రోజైన శనివారం చాలా సందడిగా సాగింది. అయితే శనివారం షో అయినప్పటికీ ఈ సారి ఎన్టీఆర్ మాత్రం కనిపించలేదు.

బిగ్ బాస్ ఇంటి నుండి ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన సభ్యులంతా ఒక్కొక్కరుగా మళ్లీ ఇంట్లోకి వచ్చారు. సమీర్, సంపూర్ణేష్ బాబు, దీక్షసేత్, మధుప్రియ, జ్యోతి, కత్తి మహేష్, ధనరాజ్, ప్రిన్స్ అందరూ మళ్లీ బిగ్ బాస్ ఇంటికి వచ్చారు. ఫైనల్ వరకు చేరిన ఐదుగురు సభ్యులకు బెస్టాఫ్ లుక్ చెప్పారు.

ముమైత్ ఖాన్ రాలేదు

ముమైత్ ఖాన్ రాలేదు

ఇప్పటి వరకు బిగ్ బాస్ షోలో పాల్గొన్న సభ్యులంతా వచ్చారు కానీ.... ముమైత్ ఖాన్ మాత్రం బిగ్ బాస్ ఇంట్లో చివరి రోజు గడిపేందుకు రాలేదు.

సందడే సందడి

సందడే సందడి

బిగ్ బాస్ ఇంట్లో ఇప్పటి వరకు పాల్గొన్న సభ్యులంతా రావడంతో సందడి వాతావరణ నెలకొంది. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా గడుపుతున్న ఐదుగురు సభ్యులు ఇంట్లోకి ఎంటరైన మాజీ సభ్యుల ద్వారా బయట జరిగే విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.

పార్టీ కోసం బట్టలు పంపిన బిగ్ బాస్

పార్టీ కోసం బట్టలు పంపిన బిగ్ బాస్

బిగ్ బాస్ ఇంట్లో చివరి రోజు కావడంతో సభ్యులందరితో కలిసి చిన్న ఎంటర్టెన్మెంట్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీ కోసం ఐదుగురు ఫైనలిస్టులకు బిగ్ బాస్ కొత్త బట్టలు పంపారు.

స్లీవ్ లెస్ పంపడంతో షాకైన హరితేజ

స్లీవ్ లెస్ పంపడంతో షాకైన హరితేజ

అయితే తాను జీవితంలో ఇప్పటి వరకు ఎప్పుడూ వేసుకోని స్లీవ్ లెస్ బట్టలు పంపడంతో హరితేజ షాకైంది. అయితే బిగ్ బాస్ ఆదేశాలు కాదనడానికి వీల్లేదు కాబట్టి ఆమె ఆ బట్టలు వేసుకోక తప్పలేదు. హరితేజ ఆ దుస్తుల్లో చాలా అందంగా కనిపించారు.

సంపూ-ధనరాజ్ ఫన్నీగా

సంపూ-ధనరాజ్ ఫన్నీగా

పార్టీ మధ్యలో సంపూ, ధనరాజ్ మధ్య ఫన్నీ కన్వర్జేషన్ జరిగింది. తాగినట్లు యాక్ట్ చేస్తూ ఏదో పబ్బులో ఫిగర్ కోసం గొడవ పడ్డట్లు ఫన్ క్రియేట్ చేశారు.

ఒప్పోడాల్

ఒప్పోడాల్

పార్టీ జరుగుతుండగా ఇంట్లోకొ ఒప్పోడాల్ ఎంటరైంది. ఆ బొమ్మతో కలిసి డాన్స్ చేస్తూ ఇంటి సభ్యులు సందడి సందడిగా గడిపారు.

అమేజింగ్ పార్టీ

అమేజింగ్ పార్టీ

ఈ పార్టీ సందర్భంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు అమేజింగ్ ఫుడ్, డ్రింక్స్ ఏర్పాటు చేశారు. బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు ఎప్పటికీ గుర్తుండి పోయేలా ఈ పార్టీ జరిగింది.

చివరి సెల్పీ

చివరి సెల్పీ

బిగ్ బాస్ ఇంట్లో అర్దరాత్రి వరకు గడిపిన అనంతరం అందరూ కలిసి చివరి సెల్పీ తీసుకుని ఇతర సభ్యులంతా ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు.

ప్రేక్షకులతో లైవ్

ప్రేక్షకులతో లైవ్

బిగ్ బాస్ షో చివరి రోజుకు చేరడంతో ఇంటి సభ్యులతో ప్రేక్షక్షులు స్వయంగా లైవ్ లో మాట్లాడే అవకాశం కల్పించారు. ప్రసాద్స్ ఐమాక్స్ లో ఇందుకు సంబంధించి కార్యక్రమం జరిగింది.

ఫన్నీ ఫన్నీ ప్రశ్నలు

ఫన్నీ ఫన్నీ ప్రశ్నలు

ప్రసాద్స్ ఐమాక్స్ లో జరిగిన లైవ్ షో సందర్భంగా ప్రేక్షకులు ఇంటి సభ్యులపై ఫన్నీ ఫన్నీ ప్రశ్నలు వేశారు.

ఇంటి సభ్యులతో

ఇంటి సభ్యులతో

ఫైనల్ వరకు చేరిన ఇంటి సభ్యులకు కుటుంబ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడే అవకాశం కల్పించారు.

శివ బాలాజీ కొడుకు ముద్దు ముద్దుగా...

శివ బాలాజీ కొడుకు ముద్దు ముద్దుగా...

నిన్ను మిస్సవుతున్నాను నాన్న, త్వరగా రండి అంటూ శివ బాలాజీ తనయుడు ముద్దు ముద్దుగా చెప్పిన మాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

తల్లిదండ్రులతో అర్చన

తల్లిదండ్రులతో అర్చన

అర్చన తల్లిదండ్రులు లైవ్ లో మాట్లాడుతూ అర్చనకు లైవ్ లో ధైర్యం చెప్పారు.

హరితేజ తల్లిదండ్రులు

హరితేజ తల్లిదండ్రులు

హరితేజ తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు. నువ్వు బాగా ఆడాలని వారు దైర్యం చెప్పారు.

English summary
Bigg Boss 23 Sep, Season 1, Episode 70 details. All participants take leave after wishing the finalists. The public interacts with the finalists over a video call. Later, each finalist has a surprise in the confession room.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu