అతడితో ఏమిటి సంబంధం? మరణానికి కొన్ని గంటల ముందు శ్రీదేవి ఇలా (ఫోటోస్)
శ్రీదేవి మరణం యావత్ సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టివేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు తమ అతిలోక సుందరి ఇక ఈ లోకంలో లేదు అనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అయితే శ్రీదేవి దుబాయ్ ఎందుకు వెళ్లారు? మరణానికి ముందు ఆమె ఎవరితో గడిపారు? నిన్న రాత్రి అసలు ఏం జరిగింది? అనేది హాట్ టాపిక్ అయింది.
Recommended Video


అతగాడి వివాహం కోసమే
బాలీవుడ్ నటుడు మోహిత్ మార్వా పెళ్లి వేడుక కోసం శ్రీదేవితో పాటు ఆమె భర్త బోనీ కపూర్, ఖుషి కపూర్ దుబాయ్ వెళ్లారు. ఈ పెళ్లి వేడుకలో ఉండగానే శ్రీదేవి తీవ్రమైన గుండె పోటుకు గురై మరణించారు.

మోహిత్ మార్వాతో రిలేషన్ ఏమిటి?
మోహిత్ మార్వా.... బోనీ కపూర్ సోదరి రీనా మార్వా కుమాడు. తన మేనల్లుడి వివాహం కావడంతో బోనీ కపూర్-శ్రీదేవి దంపతులు తమ కూతురు ఖుషి కపూర్‌తో కలిసి దుబాయ్ వెళ్లారు. అయితే జాహ్నవి కపూర్‌కు ‘ధడక్' షూటింగ్ ఉండటంతో ఆమె వెళ్లలేక పోయారు.

శ్రీదేవి-బోనీ చేతుల మీదుగా
మోహిత్ మార్వా మేనమామల్లో బోనీ కపూర్ అగ్రజుడు. దీంతో పెళ్లి వెడుక ముందు, తర్వాత జరిగే తంతులో బోనీ-శ్రీదేవిలు కీలకం అయ్యారు. అందుకే అందరి కంటే ముందే వీరు దుబాయ్ చేరుకున్నారు.

సంతోషంగా గడిపిన శ్రీదేవి
తమ కుటుంబంలోని వివాహం కావడంతో శ్రీదేవి కపూర్ ఎంతో సంతోషంగా కనిపించారు. ప్రముఖ బాలీవుడ్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్న దుస్తువుల్లో సందడి చేశారు.

స్ట్రెయిన్ అయ్యారా?
అయితే పెళ్లి వేడుకలో గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీదేవి చాలా చాలా హ్యాపీగా గడిపారు. అయితే ఈ క్రమంలోనే ఆమె కాస్త స్ట్రెయిన్ అయినట్లు, ఈ క్రమంలోనే ఆమె గుండె పోటుకు గురైనట్లు తెలుస్తోంది.

ఎవరూ ఊహించలేదు
ప్రస్తుతం శ్రీదేవి పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. గతంలో ఆమె ఎప్పుడూ గుండె పోటుకు గురి కాలేదు. సాధారణంగా అయితే మొదటి సారి హార్ట్ ఎటాక్ వస్తే ఎక్కువ శాతం మంది ప్రాణాలతో బయట పడతారు. అయితే శ్రీదేవికి ఆమె గుండె తట్టుకోలేనంత తీవ్రస్థాయిలో ఎటాక్ రావడంతో...... ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.


Click it and Unblock the Notifications











