ఎంఎస్ నారాయణ లాస్ట్ వర్కింగ్ స్టిల్ ఇదే... (ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ మరణం తెలుగు సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తింది. ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ప్రస్తుతం టాలీవుడ్లో బిజీగా ఉన్న టాప్ కమెడియన్లలో ఆయన ఒకరు. తన నట జీవితంలో 1000 చిత్రాల్లో నటించాలనే డ్రీమ్‌తో ముందుకు సాగుతున్న ఆయన 750కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన కల నెరవేకుండానే ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లి పోవడం విషాదకరం.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Last working still of MS Narayana

ఎంఎస్ నారాయణ నటిస్తున్న పలు చిత్రాలు ఇంకా సెట్స్ మీదనే ఉన్నాయి. అందులో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘S/O సత్యమూర్తి' కూడా ఒకటి. ఈ చిత్రానికి సంబంధించి ఎంఎస్ నారాయణ షూటింగ్ పార్టు పూర్తయింది. అయితే ఆయన పాత్రకు డబ్బింగ్ మాత్రం పూర్తి కాలేదు.

ఈ చిత్రంలో ఎంఎస్ నారాయణకు సంబంధించిన వర్కింగ్ స్టిల్ ఒకటి బయటకు వచ్చింది. అల్లు అర్జున్, అలీ, ఎంఎస్ నారాయణలకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సీన్ వివరిస్తున్న సందర్భంలో యూనిట్ సభ్యులు ఒకరుతీసిన స్టిల్ ఇది. ఎంఎస్ జీవితంలో ఇదే చివరి వర్కింగ్ స్టిల్. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.

సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం ఎంఎస్ నారాయణ భీమవరం వెళ్లారు. అక్కడ ఆయనకు మలేరియా సోకడంతో 19న ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో పాటు షుగర్, కిడ్నీ, హార్ట్ సమస్యలు తలెత్తడంతో హైదరాబాద్‌ కొండాపూర్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 23న మరణించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X