నా వీడియోలన్నీ పోయాయ్.. హ్యాకింగ్‌పై నోరు విప్పిన లాస్య
సోషల్ మీడియాలో యుగంలో ఏదీ కూడా పూర్తి భద్రతతో ఉండదు. మరీ ముఖ్యంగా ట్విట్టర్ ఫేస్ బుక్ ఇన్ స్టా వంటి సాధనాలు హ్యాక్ అవుతుంటాయి. సెలెబ్రిటీలకు నిత్యం అదొక తలనొప్పిగా మారుతూ ఉంటుంది.అయితే తాజాగా లాస్య విషయంలోనూ అలాగే జరిగింది. కాకపోతే లాస్యకు సంబంధించిన యూట్యూబ్ చానెల్‌ను తస్కరించేశారు. హ్యాకర్స్ దెబ్బకు లాస్య టాక్క్ అనే యూట్యూబ్ చానెల్ ఎగిరిపోయింది.

ఎంతో కష్టపడి..
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక లాస్య తన యూట్యూబ్ చానెల్ మీదే ఫోకస్ పెట్టేసింది. బిగ్ బాస్ కంటెస్టెంట్లు, వారి ఫ్యామీలతో కలిసి ఇంటర్వ్యూలు చేసింది. అవి మిలియన్ల కొద్దీ వ్యూస్‌లను కొల్లగొట్టాయి. లాస్య చేసిన ప్రతీ వీడియో ట్రెండింగ్‌లోకి వచ్చేది.

కష్టమంతా వృథా..
ఎంతో కష్టపడి చేసిన వీడియోలన్నీ గంగ పాలయ్యాయి. మొత్తంగా హ్యాకర్స్ చేతికి వెళ్లిపోయాయి. అసలు యూట్యూబ్ చానెల్ మొత్తానికే కనిపించడం లేదు. ఈ విషయాన్ని లాస్యకు తన అభిమానులు, సన్నిహితులు చెప్పారట. నిన్న సాయంత్రం నుంచి ఈ సమస్య ఏర్పడిందట.

వీడియోలు పోయాయ్..
యూట్యూబ్ చానెల్ హ్యాక్ అవ్వడంపై లాస్య స్పందించింది.. నా యూట్యూబ్ చానెల్ హ్యాక్ అయింది.. వీడియోలన్నీ పోయాయ్.. నా యూట్యూబ్ చానెల్ నుంచి ఏదో లైవ్ వెళ్లిపోతోందని కొందరు ఫోన్లు, మెసెజ్‌లు చేశారు.. నిన్న సాయంత్రం 6 నుంచి 6.30 మధ్య సడెన్‌గా లైవ్ వెళ్లింది.. ఆ విషయం వేరే వాళ్లు ఎవరో ఫోన్ చేసి చెప్పేంత వరకు నాకు తెలియలేదని లాస్య చెప్పుకొచ్చింది.

ఎంతో సపోర్ట్..
ఎంతో బాధగా అనిపించింది.. ఈ విషయం తెలిసి ఎంతో మంది ఫేస్ బుక్, ఇన్ స్టాలో మద్దతు తెలుపుతున్నారు.. మేమంతా అండగా ఉంటాం.. సపోర్ట్ చేస్తామని అంటున్నారు.. నా వీడియోలన్నీ వేరే చానెల్‌కి వెళ్లిపోయాయ్.. దీనిపై మా టీం పని చేస్తోంది.. మళ్లీ వెనక్కివస్తుందని అంటున్నారని లాస్య చెప్పుకొచ్చింది.
Recommended Video

కాస్త సమయం..
నా యూట్యూబ్ చానెల్ మళ్లీ వెనక్కి వస్తుందని నా టీం చెబుతోంది.. అయితే కాస్త ఆలస్యం అయ్యేలా ఉంది..నా చానెల్ చేతిలోకి వచ్చాక మళ్లీ కొత్త వీడియోలతో వస్తాను. కాకపోతే కాస్త సమయం పడుతుందంటూ లాస్య ఎమోషనల్ అవుతూ ఫేస్ బుక్‌లో వీడియోను షేర్ చేసింది.


Click it and Unblock the Notifications











