twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లతా మంగేష్కర్‌కు యశ్ చోప్రా పురస్కారం

    By Bojja Kumar
    |

    Lata Mangeshkar
    ముంబై : లెజండరీ సింగర్ లతా మంగేష్కర్‌ను 'యశ్ చోప్రా జాతీయ స్మారక అవార్డు-2013'కు ఎంపిక చేసారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత అయిన యశ్ చోప్రా ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం సినీ రంగంలో సేవలు అదించిన వారికి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు.

    ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఆ అవార్డుకు లతా మంగేష్కర్‌ను ఎంపిక చేసారు. పురస్కారంతో పాటు రూ. 10 లక్షల నగదు, ప్రశంసా పత్రం అందజేయనున్నారు. అక్టోబర్ 19న ముంబైలో ఈ పురస్కరాన్ని ప్రదానం చేస్తామని అవార్డు కమిటీ చైర్మన్ టి. సుబ్బిరామిరెడ్డి తెలిపారు. అవార్డు కమిటీ జ్యూరీ సభ్యులుగా హేమా మాలిని, అనిల్ కపూర్, సిమి గరెవాల్ వ్యవహరిస్తున్నారు.

    యశ్ చోప్రా గురించి మాట్లాడుతూ...అరవయ్యేళ్లపాటు చిత్ర పరిశ్రమలో దర్శక నిర్మాతగా కొనసాగిన వ్యక్తి యశ్ చోప్రా. అలాంటి ఓ మంచి దర్శకుడి పేరును నిత్యం స్మరించుకొనేలా ఈ అవార్డును ఏర్పాటు చేసాం. దేశం గర్వించదగ్గ గాయని, భారతరత్న లతా మగేష్కర్‌కు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తుండటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

    యశ్ చోప్రాతో ఉన్న అనుబంధం గురించి సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ... 'ఓ నిర్మాతగా ఆయనతో నాకు చక్కటి అనుబంధం ఉంది. విజయ్, చాందినీ, లమ్ హే తదితరల చిత్రాలను యశ్ చోప్రా దర్శకత్వంలో నిర్మించాను' అని తెలిపారు. ఆగస్టు 11న సుబ్బిరామిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సినీతారలతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.

    English summary
    Legendary singer Lata Mangeshkar will be given the inaugural National Yash Chopra Memorial Award. Industrialist-politician T Subbarami Reddy, who has produced Hindi movies like 'Vijay', 'Chandni' and 'Lamhe', announced the award in memory of late filmmaker Yash Chopra.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X