లతా మంగేష్కర్‌తో హజారికా ఎఫైర్!

ఓ అస్సామీ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో...ప్రియంవద మాట్లాడుతూ తన మాజీ భర్త భూపెన్ హజారికాతో లతా మంగేష్కర్ ఎఫైర్ నడిపిందని ఆమె చెప్పుకొచ్చారు. 50 ఏళ్ల క్రితమే తన భర్తతో విడిపోయిన సందర్బాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఈ విషయాలను ప్రస్తావనకు తెచ్చారు.
అతా మంగేష్కర్ కోల్‌కతా వచ్చినప్పుడు టాలీగంజ్‌లోని భూపెన్ హజారికాకు చెందిన మూడు బెడ్ రూంల ఫ్లాట్ లో ఒక దాన్ని వాడుకునే వారని, హజారికా రాత్రంతా ఆమెతోనే ఉండే వారని, ఒకసారి తన భర్తను ఈ విషమై ప్రశ్నించగా కొన్ని సార్లు అలా చేయాల్సి వస్తుందని చెప్పేవారని, ఇండియాలో మ్యూజీషియన్స్ ఎదగాలంటే లతా మంగేష్కర్ లాంటి వారితో పాడించాలని చెప్పే వారని..... ప్రియంవద చెప్పుకొచ్చారు. శనివారం ఈ కార్యక్రమం ప్రసారం అయింది.
భారత ప్రభుత్వం నుంచి పలు అత్యున్నత పురస్కారాలు అందుకున్న లతా మంగేష్కర్ పై ఇలాంటి ఆరోపణలు రావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ప్రియంవద వ్యాఖ్యలపై ఆగ్రహంగా ఉన్న అతా మంగేష్కర్ కుటుంబ సభ్యులు లీగల్‌గా చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











