క్లాసిక్స్ చెడగొడుతున్నారు: గాన కోకిల లతా మంగేష్కర్ అసంతృప్తి
రీమిక్స్ చేయడం ఒరిజినల్ పాటను అగౌరవపరిచినట్లేనని అతా మంగేష్కర్ అన్నారు. పాత క్లాసిక్స్‌ను రీమిక్స్ చేయడం అంటే... తాజ్ మహల్‌కి కొత్త గదులు చేర్చడం లాంటిదే అన్నారు.
యష్ రాజ్ ఫిల్మ్స్ తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో 'మే యార్ మనా నీ' అనే రీమిక్స్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. ఒరిజినల్‌గా ఈ పాట 1973లో విడుదలైన 'డాగ్' అనే సినిమాలోనిది. అప్పట్లో ఈ పాటను గాన కోకిల్ లతా మంగేష్కర్ పాడారు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం అందించారు.
ఇపుడు ఈ పాటను హితేష్ మోదక్ రీమిక్స్ చేయగా, యషితాశర్మ పాడారు. ఈ పాటకు వాణి కపూర్ మోడ్రన్ డాన్స్ స్టెప్స్ జోడించి ఈ పాటను విడుదల చేశారు. అయితే ఈ పాటను రీమిక్స్ చేయడంపై లతా మంగేష్కర్ స్పందన కోరగా ఆమె... ఈ రీ మిక్స్ వ్యవహారాన్ని తప్పుబట్టారు.

అగౌరవ పరచడమే, నేను వినను
రీమిక్స్ చేయడం ఒరిజినల్ పాటను అగౌరవపరిచినట్లేనని ఆమె అన్నారు. అందుకే రీమిక్స్ పాటలను తాను వినబోనని చెప్పారు. `నేను ఈ రీమిక్స్ పాట వినలేదు. వినబోను కూడా... అని ఆమె సమాధానం ఇచ్చారు.

నేను కామెంట్ చేయదలుచుకోలేదు
తన పాటను రీమిక్స్ చేయడం మీద తాను ఎలాంటి కామెంట్ చేయదలుచుకోలేదని.... లతా మంగేష్కర్ తన పరోక్షంగా తన అసంతృప్తిని వెల్లగక్కారు.

చెడగొడుతున్నారు
నేను మొదట్నుంచి రీమిక్స్ పాటలను వ్యతిరేకిస్తూనే ఉన్నాను. క్లాసిక్ పాటలను మళ్లీ రీమిక్స్ చేయవద్దు. అలా చేస్తే వాటిని అగౌరవ పరచడమే. ఇప్పటికే లక్ష్మీకాంత్ ప్యారేలాల్, మదన్ వంటి దిగ్గజాల పాటలకు బీట్స్, లిరిక్స్ జోడించి చెడగొట్టారు అని ఆమె అన్నారు.

తాజ్ మహల్‌కు కొత్తగా గదులు కట్టడమే
పాత క్లాసిక్స్‌ను రీమిక్స్ చేయడం అంటే... తాజ్ మహల్‌కి కొత్త గదులు చేర్చడం లాంటిదే. ఒరిజినల్ పాటను క్రియేట్ చేయలేనపుడు మరొకరి పాటను రీమిక్స్ చేయడం సబబు కాదు` అని లత అన్నారు.
రీమిక్స్ చేసిన పాట ఇదే
యష్ రాజ్ ఫిల్మ్స్ తాజాగా తన యూట్యూబ్ ఛానల్‌లో రిలీజ్ చేసిన ‘మే యార్ మనా నీ' అనే రీమిక్స్ సాంగ్ ఇదే.
ఒరిజినల్ సాంగ్
‘మే యార్ మనా నీ' ఒరిజినల్ సాంగ్ వీడియో


Click it and Unblock the Notifications











